Karregutta Mulugu Effects( imge credit; twitter)
నార్త్ తెలంగాణ

Karregutta Mulugu Effects: ఆదివాసీల ఊచకోతలు.. మావోయిస్టుల హింస.. కర్రెగుట్టల వాస్తవ కథనం!

Karregutta Mulugu Effects: కర్రెగుట్టలు ప్రకృతి రమణీయతకు ఆనవాళ్లు, నల్లటి కొండలు, పచ్చటి చెట్లు, పక్షుల కిలకిల రావాలు, గుట్టల మధ్యనికి సెలయేటి పరవాళ్ళు, వెరసి స్వచ్ఛమైన వాతావరణానికి కర్రెగుట్ట ప్రాంతాలు ప్రత్యేక నిలయాలు, ఇలాంటి స్వచ్ఛమైన ప్రకృతి లో 1970, 80 దశకాల్లో ఆదివాసీలు అక్కడ గుహలను నివాస స్థావరాలుగా ఏర్పరచుకుని జీవనం సాగించారు. కొంతమంది గుర్తు తెలియని శక్తులు మావోయిస్టులపై నిత్యం దాడుల పరంపర కొనసాగించడంతో బెంబేలెత్తిపోయారు.

ఈ క్రమంలోనే 1990 లో అప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్ బ్రహ్మదేవ్ శర్మ(బీడీ శర్మ) ఆదివాసీలను గుట్ట పైనుంచి కిందకి రావాలని, వచ్చిన వారందరికీ ఆవాసంతో పునరావాసం కల్పిస్తామన్నారు. మాటలకే పరిమితమైన కలెక్టర్ మాటలు ఆదివాసీలు అంతగా పట్టించుకోలేదు. గుట్ట పైన ఉన్న సౌకర్యాలు కింద లేనప్పటికీ నివాసయోగ్యాలను తమకు చేతనైన స్థాయిలో చేసుకుని ఆవాసం ఉంటున్నారు. గుట్టపైన లభించిన అటవీ ఉత్పత్తుల్లాగానే కింద కూడా లభించడంతో గుట్టల పైకి వెళ్లాలని ఆలోచనను ఆదివాసి ప్రజలు విరమించుకున్నారు.

 Also Read: MLA Kadiyam Srihari: దేవుడి భూములపై.. అక్రమ ఆక్రమణలకు ఆస్కారం లేదు.. స్పష్టం చేసిన ఎమ్మెల్యే!

అలాంటి కర్రెగుట్టల ప్రాంతం మావోయిస్టుల కోటగా మారిపోయింది. ప్రస్తుతం కేంద్ర, చత్తీస్గడ్ రాష్ట్ర భద్రత బలగాలు కూంబింగ్ జరప కంటే ముందు కర్రెగుట్టలు మావోయిస్టులకు పెట్టని కోటగా భావించేవారు. ఈ ప్రాంతంలో అడవులు చుట్టూ ఉండడంతో కష్టతరమైన ప్రదేశం కావడంతో మావోయిస్టులకు ఇది సురక్షిత ప్రదేశంగా ఉంటుంది. భద్రతా దళాల ఆపరేషన్ భద్రత బలగాలు కర్రె గుట్టలలో మావోయిస్టులను ఎదుర్కోవడానికి, కార్యకలాపాలను అణచి వేయడానికి తరచుగా ఇక్కడ ఆపరేషన్లు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో భద్రతా దళాలు… మావోయిస్టుల మధ్య తరచు ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి.

కొన్ని సందర్భాల్లో భారీ ఎన్కౌంటర్లు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో భద్రతా దళాల ఆపరేషన్లు, మావోయిస్టుల కార్యకలాపాలు స్థానికులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఈ గొడవల్లో చిక్కుకొని కొంతమంది అమాయక ఆదివాసీలు ప్రాణాలు సైతం కోల్పోయే పరిస్థితి నెలకొంది. కర్రెగుట్టల ప్రాంతంలో మావోయిస్టులు కార్యకలాపాలు, భద్రతా దళాల ఆపరేషన్ల నేపథ్యంలో శాంతి చర్చలు జరపాలని ఆదివాసి సంఘాలు, కుల సంఘాలు, పలు పార్టీల నేతలు కోరుతున్నారు.

 Also Read: Uttam Kumar Reddy: యుద్ధానికి నేను రెడీ.. పాకిస్థాన్ కు బుద్ధి చెప్పాల్సిందే!

భద్రతా బలగాల ఆపరేషన్లు, మావోయిస్టుల కార్యకలాపాలతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ ఘటనలతో ప్రజల సాధారణ జీవితం పై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. కర్రెగుట్టలు తెలంగాణ-చత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దులో ఉన్నది. ఇది మావోయిస్టులకు స్వర్గధామం కాగా, మావోయిస్టులను మట్టు పెట్టేందుకు భద్రత దళాలు ఆపరేషన్లకు వేదికగా నిలిచింది. ఈ క్రమంలోనే అసలు కర్రెగుట్టల ప్రాంతానికి నక్సల్స్ ఎందుకు చేరుకున్నారు…? వారిని కర్రెగుట్టల ప్రాంతంలోనే అంతమొందించాలని భద్రతా బలగాలు ఎందుకు కూంబింగులు నిర్వహిస్తున్నాయనే దానిపై స్వేచ్ఛ ప్రత్యేక కథనం…

అసలు కర్రెగుట్టల్లో ఏముంది..?

మావోయిస్టులకు స్వర్గధామమైన కర్రెగుట్టల ప్రాంతాన్ని ఎందుకు తమ ఆధీనంలోకి తీసుకోవాలనుకుంటుంది. కర్రెగుట్టలను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి గల కారణాలు ఏంటి..? కేంద్రం, చత్తీస్గడ్ రాష్ట్రం భద్రతా బలగాలను రంగంలోకి దింపి మావోయిస్టులను మట్టికరిపించేలా చర్యలు చేపట్టడం లక్ష్యంగా ఎందుకు దిగాయి. కర్రిగుట్టల ప్రాంతం దాదాపు 287 ఎకరాల విస్తీర్ణంలో ఆవరించి ఉందని తెలిసిన కొందరు చెబుతుంటారు. ఈ ప్రాంతమంతా నల్లటి గుట్టలతో నిక్షిప్తమై ఉంది.

ఈ గుట్టల్లో ఐరన్ కు సంబంధించిన ముడి సరుకు ఉందా అనేది అక్కడి ఆదివాసీలకు తెలీదు. కాళ్ల కిందనే ఖనిజ సంపద ఉందనేది ఆదివాసీలు గ్రహించలేదు. కర్రెగుట్టల ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న చత్తీస్గడ్ ప్రాంతంలో ఎక్కడ తగిన డైమండ్స్ బయటకు వస్తాయనేది కూడా ప్రచారంలో ఉంది. దేశంలో జార్ఖండ్, చత్తీస్గడ్, మధ్యప్రదేశ్ లలోని అటవీ ప్రాంతంలో ఎక్కువగా ఖనిజ సంపద ఉన్నట్లుగా ప్రాచుర్యంలో ఉంది.

 Alos Read: Maoists Surrendered: కొత్తగూడెంలో 38 మంది నక్సల్స్ లొంగుబాటు.. కారణం అదేనా!

యురేనియం, ఐరన్, డైమండ్స్
కర్రెగుట్టల గుహల ప్రాంతంలో యురేనియం పాయింట్ ఉన్నట్లు మావోయిస్టులు గుర్తించారా…? ఇది గమనించిన కేంద్ర ప్రభుత్వం అక్కడ మకాం వేయాలనుకుంటుందా..? అందుకే మావోయిస్టులు… కేంద్ర బలగాలకు మధ్య యుద్ధం జరుగుతోందా..? అంటే పూర్తిస్థాయిలో ఇంకా తెలియాల్సి ఉంది. కర్రెగుట్టల ప్రాంతంలో యురేనియం, ఐరన్, డైమండ్స్ తో పాటు 29 రకాల ఖనిజాలు ఉన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందా..? ఇందుకోసమే గత పది సంవత్సరాల క్రితం కర్రెగుట్టల ప్రాంతానికి హెలికాప్టర్ చేరుకుందా..? అంటే కొన్నింటికి సమాధానం ఉందా అనిపించినప్పటికీ… పూర్తిస్థాయిలో మాత్రం వివరాలు తెలియాల్సిన పరిస్థితి ఉంది.

గత పదేళ్ల క్రితం కర్రెగుట్టల ప్రాంతంలో కూలిపోయిన హెలికాప్టర్ ఆనవాళ్లు ఇప్పటికీ అక్కడే ఉన్నట్లుగా సమాచారం. ఖనిజ సంపద సర్వే కోసం వెళ్లి పడిపోయిందా..? లేదంటే మరే పనికి అయినా వెళుతూ అనుకోకుండా కర్రెగుట్టల ప్రాంతంలో టవర్ లాగా ఎత్తుగా ఉన్న గుట్టను సిగ్నల్స్ లేని కారణంగా డీ కొట్టిందా అనేది కూడా ప్రశ్నార్థకమే.

గుట్టల పైనుంచి వచ్చిన ఆదివాసీలు 20 గ్రామాల్లో ఆవాసాలు
1990లో అంతగా టెక్నాలజీ లేదు. అలాంటి సమయంలోనే గుర్తు తెలియని శక్తులు ఆదివాసీలపై దాడి ఎందుకు చేశారో … వారికి అర్థం కాలేదు. గుట్టల ప్రాంతం నుంచి కింద ప్రాంతంలో ఆవాసాలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్న ఓ గ్రామం పామునూరు గ్రామస్తులను ఊచకోత ఎందుకు కోశారు…? ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్న గాని మిగిలింది. కర్రెగుట్టలో పైనుంచి వచ్చిన ఆదివాసీలు కానూరు, జెల్లా కాలనీ, డోలి, చెలిమల, పామునూరు, కలిపాక, ముత్తారం, పెంక వాగు, సీతారాంపురం, పెనుగోటి కాలనీ, ఒంటిమామిడి, బొల్లారం, ఆరుగుంటపల్లి, ప్రగల్లపల్లి, ముర్మూరు, కరీవేణి గుంపా, మల్లాపురం గ్రామాలను ఆవాసాలుగా ఆదివాసీలు చేసుకుని ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. తాజాగా కర్రెగుట్టల ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు జరుగుతున్న సంఘర్షణతో ఆదివాసి గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి.

 Also Read: Indiramma Houses: జర్నలిస్టుల సంక్షేమం కోసం.. కొత్త ఆర్థిక సహాయం!

విరివిగా డైమండ్స్, ఐరన్ లభ్యం
కర్రెగుట్టల ప్రాంతంలో విరివిగా డైమండ్స్ సంబంధించిన ముడిసరుకు, ఐరన్ ఓర్ కు సంబంధించిన ముడి సరుకు కూడా ఇక్కడ లభ్యమవుతుందనేది విస్తృత ప్రచారం సాగుతోంది. అయితే ఐరన్, యురేనియం, డైమండ్స్ లతో పాటు 29 రకాల ఖనిజ ఉత్పత్తికి మావోయిస్టులు అడ్డుగా ఉన్నారని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ దాడులకు పూనుకుందా…? అనే విధంగా కూడా చర్చ జరుగుతుంది.

యురేనియం కోసం ప్రత్యేక టన్నెల్ ద్వారా రైలు మార్గం…?
కర్రెగుట్టల ప్రాంతంలో నిక్షిప్తమై ఉన్న యురేనియం తవ్వకాల కోసం ప్రత్యేక టన్నేల్ ద్వారా రైలు మార్గం వేసేందుకు ప్రణాళిక చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపడుతుందనేది మరో వాదన. యురేనియం విమాన సంబంధిత మెటీరియల్ కోసం ఉపయోగిస్తారు. ఇది బంగారం కంటే విలువైన ఖనిజంగా భావిస్తుంటారు. ఇకపోతే రాళ్లలో ఐరన్ లభించడంతోపాటు కర్రెగుట్టల ప్రాంతంలో డైమండ్స్ కు సంబంధించిన కొన్ని కడ్డీలు మొక్కల్లాగా భూమిలో నుంచి పైకి ఎదుగుతాయట…! భూమి నుంచి బయటకు వచ్చి నిటారుగా నిలిచి ఉంటాయట. కర్రెగుట్టల ప్రాంతం మొత్తం ఐరన్ కు సంబంధించిన ఉంటుందట. ఒక్క రాయి తీసుకొచ్చి కొలిమిలో పెడితే గొడ్డలి తయారయ్యేంత ఇనుప ఖనిజం వస్తుందని అక్కడివారు చెబుతున్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్