Uttam Kumar Reddy(image credit: twitter)
తెలంగాణ

Uttam Kumar Reddy: యుద్ధానికి నేను రెడీ.. పాకిస్థాన్ కు బుద్ధి చెప్పాల్సిందే!

Uttam Kumar Reddy: యుద్ధం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, పూర్తి స్థాయిలో చేసేందుకు తాను రెడీగా ఉన్ననని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) ప్రకటించారు. తన సేవలను కోరితే తప్పకుండా అందిస్తానని వెల్లడించారు. తనకు యుద్ధ విమానాల ఫైలెట్ గా పనిచేసిన అనుభవం ఉన్నదని, తప్పకుండా పోరాడుతానని నొక్కి చెప్పారు.

ఆయన గాంధీభవన్ లో చిట్ చాట్ చేశారు. తాను 16 ఏళ్లకే ఎన్ డీఏ పూణేలో చేరానని, అస్సాంలో ఉండే యుద్ధ విమానాల శిబిరంలో పనిచేసినట్లు గుర్తు చేశారు. మిక్ 23 ఎయిర్ క్రాఫ్ట్ కు సెలక్టై, అవంతి పూర్, శ్రీనగర్, ఆదమ్ పూర్, ఉత్తర లైన్, అమృత్ సార్ లో పనిచేశానని వివరించారు.

 Also Read: Operation Sindoor: సిందూర్ 3.0.. పాక్ డ్రోన్లు, ఫైటెర్ జెట్స్ స్మాష్.. సైన్యం వెల్లడి

భారత దేశ రక్షణలో తాను పనిచేయడం గర్వంగా ఉన్నదన్నారు. సియాచిన్ లో –40 డిగ్రీలు చలి ఉంటుందని, అయినా కష్టపడి ఆర్మీ టీమ్స్ పనిచేస్తాయన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలనూ పార్లమెంట్ డిఫెన్స్ కమిటీలో మెంబరుగా ఉన్నానని వివరించారు. పెహల్గమ్ ఘటనను పాకిస్థాన్ ప్రేరిపించి చేయించిందన్నారు. పాక్ బుద్ధి చెప్పాల్సిందేనని వెల్లడించారు. కుటుంబాలను విడదీసి మతం అడిగి మరీ చంపారన్నారు. లష్కరే తోయిబాకు టీఆర్ ఎఫ్​ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అని వివరించారు.

 Also Read: Pawan Kalyan: పాక్‌పై భారత్ యుద్ధం.. జనసేన శ్రేణులకు పవన్ కీలక సూచనలు

పాకిస్థాన్ లని 9 స్థావరాలను ఇండియన్ త్రివిధ దళాలు కూల్చడం సంతోషకరమన్నారు. బార్డర్ నుంచి పాకిస్థాన్ స్థావరాలపై హైమర్ బాంబులు వేశారన్నారు. పాకిస్థాన్ సామాన్య ప్రజలు, ఆర్మీని ఇండియన్ ఆర్మీ టార్గెట్ చేయలేదన్నారు. కేవలం టెర్రరిస్ట్ క్యాంపులను మాత్రమే కూల్చేసిందన్నారు. ఇండియా బార్డర్ లో ఉంటున్న అమాయకులపై కాల్పులు చేయడం దారుణమన్నారు. లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను కోలప్స్ చేయడం విశేషమన్నారు. యుద్దం కొనసాగితే పాకిస్థాన్ పతనం గ్యారంటీ అని చెప్పారు.

ఇకహెలికాప్టర్ పర్యటనలపై ప్రతిపక్ష పార్టీల ఆరోపణలపై మంత్రి ఉత్తమ్ స్పందించారు.హెలికాప్టర్ లో ప్రయాణిస్తే గంటకు మూడు వందల లీటర్లు ఫ్యూయల్ కాలుతుందన్నారు. ప్రస్తుతం వంద రూపాయలకు లీటర్ ఫుయల్ ఉన్నదని, తెలంగాణ లో ఎక్కడికి పోయినా లక్ష నుండి లక్ష 20 వేలు మాత్రమే ఖర్చు అవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఒక్క ప్రోగ్రామ్ కు ముగ్గురు, నలుగురు మంత్రులు వెళ్తున్నామని, వాళ్లంతా రోడ్డు మార్గం నుంచి వెళితే ఇంత కంటే ఎక్కువ ఖర్చు అవుతుందన్నారు. టైమ్ కూడా కలిసి వస్తుందన్నారు. హెలికాప్టర్ గత ప్రభుత్వమే లీజుకు తీసుకున్నదన్నారు. తమకు అదనపు ఖర్చు కేవలం ఫ్యూయల్ మాత్రమే అని వెల్లడించారు. ప్రజలకు వేగంగా సేవలు అందించేందుకు మాత్రమే హెలికాప్టర్ లో వెళ్తున్నామని వివరించారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం