DGP Jithender( image credit: swetcha reporter)
హైదరాబాద్

DGP Jithender: డ్రగ్స్ మాఫియాపై గట్టి పోరాటం.. డీజీపీ జితేందర్ దిశానిర్దేశం!

DGP Jithender: డ్రగ్స్ కేసుల్లో పకడ్భంధీగా దర్యాప్తు చేయటం ద్వారా నిందితులకు శిక్షలు పడేలా చూడాలని డీజీపీ జితేందర్​ సూచించారు. అప్పుడే మాదక ద్రవ్యాల దందా చేస్తున్నవారిలో భయం నెలకొంటుందన్నారు. తద్వారా డ్రగ్స్​ కు చెక్​ పెట్టవచ్చని చెప్పారు.

డీజీపీ కార్యాలయంలో  నార్కొటిక్​ బ్యూరో సిబ్బందితో సమావేశమైన డీజీపీ జితేందర్​ విధుల నిర్వర్తనలో ప్రతిభ కనబరిచిన పలువురు సిబ్బందికి రివార్డులు అందచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రగ్స్​ దందా..వినియోగాన్ని అరికట్టేందుకే ప్రభుత్వం నార్కొటిక్​ బ్యూరోను ఏర్పాటు చేసిందన్నారు.

 AlSO Read: Rahul Gandhi Speech: పాత తరానికి వీడ్కోలు, కొత్త నాయకత్వానికి స్వాగతం.. రాహుల్ గాంధీ!

ప్రత్యేకంగా ఇలా బ్యూరో ఏర్పాటు చేయటం దేశంలోనే మొదటిసారి అని చెప్పారు. పద్దతి ప్రకారం దర్యాప్తు జరిపి పక్కాగా సాక్ష్యాలు సేకరించి ఆయా న్యాయస్థానాల్లో ఛార్జీషీట్లు దాఖలు చేస్తే ఈ కేసుల్లోని నిందితులకు 10 నుంచి 20 సంవత్సరాల జైలు శిక్షలు పడతాయన్నారు.

అలా జరిగితేనే డ్రగ్స్ దందా చేస్తున్న వారిలో భయం పుడుతుందని చెప్పారు. శాంతిభద్రతల అదనపు డీజీ మహేశ్​ భగవత్​ మాట్లాడుతూ దర్యాప్తులోని లోపాలను అవకాశంగా చేసుకుని నిందితులు కేసుల నుంచి తప్పించుకునే అవకాశాలు ఇవ్వొద్దని చెప్పారు. ఫాస్ట్​ ట్రాక్ పద్దతిన కేసులను దర్యాప్తు చేసి నిందితులకు శిక్షలు పడేలా చూడాలన్నారు.

 Also Read: Ponnam Prabhakar: విద్యతో విజయాన్ని సాధించండి.. విద్యార్థులకు మంత్రి సూచన!

అదనపు డీజీ అనిల్​ కుమార్​ మాట్లాడుతూ డ్రగ్స్ బారిన పడి ఎంతోమంది యువకులు బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చాలన్న ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి దీని కోసమే నార్కొటిక్​ బ్యూరోను ఏర్పాటు చేశారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సిబ్బంది మరింత అంకిత భావంతో పని చేయాలన్నారు.

నార్కొటిక్​ బ్యూరో డైరెక్టర్​ సందీప్​ శాండిల్య మాట్లాడుతూ డ్రగ్స్​ దందా చేస్తున్న వారికి సంబంధించిన సమాచారాన్ని సేకరించటానికి నెట్​ వర్క్​ ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. 1908 నెంబర్​ కు ఫోన్ చేసి డ్రగ్స్ వ్యాపారం, వినియోగం జరిగితే సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో నార్కొటిక్​ బ్యూరో ఎస్పీల రూపేశ్​, అదనపు ఎస్పీ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!