Rahul Gandhi Speech: రాజకీయాల్లో పాత తరానికి స్వస్తి చెప్పి, కొత్త తరం నాయకులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆయన హైదరాబాద్ లో జరిగిన భారత్ సమ్మిట్ లో పాల్గొని ప్రసంగించారు. యువ రాజకీయ నేతలను తయారు చేయాలన్నారు. కొత్త తరం భాషను రాజకీయ నాయకులు అర్థం చేసుకోవాలని సూచించారు. సీనియర్లే యువకులకు అండగా ఉండాలన్నారు. అప్పుడే దేశంలో రాజకీయాలు కొత్త మార్పులు కనిపిస్తాయన్నారు.
గత పదేళ్లలో ప్రపంచ రాజకీయాలు మారిపోయాయని చెప్పారు. ఆధునిక సామాజిక మాధ్యమాలతో అంతా మారిపోయిందన్నారు. అందుకే రాజకీయాల్లోకి కొత్తతరం రావాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. దేశ సమస్యలు తెలుసుకునేందుకు తాను కన్యాకుమారి నుంచి సుమారు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశానన్నారు. పాదయాత్ర మొదలుపెట్టక ముందు ఆలోచించానని, మొదలుపెట్టాక వెనకడుగు వేయలేదని వివరించారు.
పాదయాత్ర మొదలు పెట్టాక చాలా మంది తనతో కలిసి నడవటం మొదలుపెట్టారన్నారు. పాదయాత్రలో జనం సమస్యలు వినటం నేర్చుకున్నానని, కానీ ఇప్పుడు వారి సమస్యలు వినటంలో నాయకులు విఫలమయ్యారని రాహుల్ గాంధీ వివరించారు. వాస్తవానికి భారత్ సమ్మిట్‌లో శుక్రవారమే పాల్గొనాల్సి ఉన్నా, కశ్మీర్‌కు వెళ్లడం వల్ల రాలేకపోయానని తెలిపారు. ఇక దేశంలో మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేశారన్నారు.
భావ ప్రకటన, స్వేచ్ఛను అడ్డుకుంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వంలో మార్పు రావాలన్నారు. ప్రజలకు అన్నీ విషయాలు తెలుసునని, బీజేపీకి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. ఇక తెలంగాణ స్టేట్ సంక్షేమం, అభివృద్ధిలో ఫర్ ఫెక్ట్ ప్లాన్ తో ముందుకు సాగుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంతో ప్రభుత్వం అద్భుతంగా నడిపిస్తన్నారని కితాబిచ్చారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు