Ponnam Prabhakar: విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునేలా హార్డ్ వర్క్ చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. విద్యతోనే సమూల మార్పులు సాధ్యమన్న విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు పిల్లల చదువుకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలన్నారు. బేగంపేట్ టూరిజం ప్లాజా లో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాల్లో ఇంటర్మీడియట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సత్కార కార్యక్రమం జరిగింది. కార్యక్రమనికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి పొన్నం తొలుత విద్యార్థులను సత్కరించారు.
ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ అందించేందుకు సర్కారు విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందని వివరించారు. సర్కారు కు చెందిన బీసీ గురుకుల్లాలోనే ఉంటే, చక్కగా చదువుకున్న 162 మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబర్చటం పట్ల చాలా ఆనందంగా ఉందని, ఇదే స్పూర్తితో విద్యార్థులు మున్ముందు కూడా తాము ఎంచుకున్న లక్ష్యాన్ని చేరేందుకు శ్రమించాలని సూచించారు. విద్యార్థి సంఘ నాయకుడిగా మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించటం తనకెంతో గర్వకారణంగా భావిస్తున్నానని మంత్రి వ్యాఖ్యానించారు.
Also Read; Rahul Gandhi Speech: పాత తరానికి వీడ్కోలు, కొత్త నాయకత్వానికి స్వాగతం.. రాహుల్ గాంధీ!
ఈ సత్కారం విద్యార్థులకు మరింత స్పూర్తి, ధైర్యాన్ని ఇచ్చి, మిగత విద్యార్థుల్లో నేను కూడా ర్యాంక్ సాధించాలన్న పట్టుదల పెరిగేందుకు దోహన పడాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులందరూ మీ కుటుంబ, గ్రామ గౌరవాన్నే గాక, మీరు చదువుతున్న సంస్థ గౌరవాన్ని కూడా కాపాడారని మంత్రి విద్యార్థులను అభినందించారు.
విద్యార్థులు ఇక్కడికే పరిమితం కాకుండా, భవిష్యత్ లో ఇంకా ఉన్నత స్థానాలకు ఎదిగేలా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. హార్డ్ వర్క్ తో పాటు ఎక్కడికెళ్లినా, గెలవాలన్న పట్టుదలతో స్పీకింగ్ స్కిల్,రైటింగ్ స్కిల్స్ పెంపొందించుకుని అనర్గళంగా మాట్లాడేట్టు ఎదగాలన్నారు.
వీటితో పాటు సమస్య వస్తే ఎలా అధిగమించాలన్న నైపుణ్యాన్ని కూడా రాణించగలిగితే, ఈ మూడు స్కిల్స్ ఉన్నవారు ఎంతటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చునని మంత్రి సూచించారు. రిజల్ట్ తక్కువ వచ్చిన పాఠశాల పై కూడా రివ్యూ చేస్తామని, త్వరలోనే వాటి పనితీరులో మార్పులు తీసుకువచ్చి, ప్రతి పాఠశాల మెరుగైన ఫలితాలు సాధించేలా తీర్చి దిద్దుతామన్నారు. మే 10 నుండి జరిగే అందాల పోటీల్లో 150 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారని, ప్రారంభోత్సవ వేడుకలకు విద్యార్థులను కూడా ఆహ్వానిస్తామని, పాల్గొనాలని మంత్రి సూచించారు.
Also ReAD: PM Modi Amaravati Visit: అమరావతిలో పీఎం మోడీ పర్యటన ఏర్పాట్లపై.. ముఖ్యమైన అప్డేట్స్ ఇవే!
గురుకులాల మీద విశ్వాసం ఉంచి విద్యార్థులను పంపిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుతూ మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని మంత్రి వారికి భరోసా ఇచ్చారు. విద్యార్థులే నా పిల్లలు అనే విధంగా విద్యాబోధన అందించాలన్న లక్ష్యంతో సర్కారు విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు మంత్రి వివరించారు.
ఇప్పుడు ర్యాంకులు రాని వారు ఏ మాత్రం నిరాశ, నిస్పృహాకు గురికాకుండా వచ్చే సంవత్సరం ర్యాంక్ సాధించాలన్న పట్టుదలతో చదువుకోవాలని మంత్రి విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శ్రీధర్ ,టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్,బీసీ సంక్షేమ శాఖ కమిషన్ బాల మాయాదేవి , గురుకుల సెక్రటరీ సైదులు ,బీసీ సంక్షేమ శాఖ అధికారులు ,విద్యార్థులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు