Tollywood Movie Hari Hara Veera Mallu Latest Update: శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఆయా చిత్రాలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే జై హనుమాన్ మూవీ నుంచి పవర్‌ఫుల్ లుక్‌ని రిలీజ్ చేశారు మూవీ యూనిట్. తాజాగా అదేబాటలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అప్‌కమింగ్ మూవీ హరిహర వీరమల్లు నుంచి మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు.
స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయింది. ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఈ మూవీ క్యాన్సిల్ అయినట్లు పుకార్లు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే శ్రీరామనవమి సందర్భంగా పుకార్లన్నింటికీ చెక్ పెడుతూ మేకర్స్ ఈ మూవీకి సంబంధించిన సాలిడ్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు.
Also Read:నటి సాయిపల్లవి వీడియో వైరల్, షాక్‌లో ఫ్యాన్స్..
ఈ మేరకు హరిహరి వీరమల్లు టీజర్ త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మీ ముందుకు ధర్మం కోసం యుద్ధం త్వరలో అంటూ పవన్ లేటెస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. చేతిలో కత్తి పట్టుకుని, కోర చూపులతో పవర్ స్టార్ ఆడియెన్స్‌ని అట్రాక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మళయాలంలో రిలీజ్ కానుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.ఎం.రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
జై శ్రీరామ్… శ్రీరామనవమి శుభాకాంక్షలతో… Team #HariHaraVeeraMallu is set to release the teaser Out Soon! 🔥@PawanKalyan @DirKrish @thedeol @AgerwalNidhhi @mmkeeravaani @AMRathnamOfl @ADayakarRao2 @rathinamkrish @gnanashekarvs @cinemainmygenes #HyperAadi @aishureddy82 @juji79… pic.twitter.com/i7q4r6q2wA
— BA Raju’s Team (@baraju_SuperHit) April 17, 2024