Actress Sai Pallavi Sheela Ki jawani College Fest video: హీరోయిన్ సాయి పల్లవి డ్యాన్సులు ఎలా ఉంటాయన్నది ఆడియెన్స్‌కు స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మోడ్రన్ స్టెప్పులంటే రౌడీ బేబీ, ట్రెడిషనల్ డ్యాన్స్ అంటే ప్రణవాలయ సాంగ్‌ను చూపిస్తే చాలు..సాయి పల్లవి టాలెంట్ ఏంటన్నది ఇట్టే తెలుస్తుంది. నెమలి నాట్యం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది సాయి పల్లవి డ్యాన్స్ చేస్తుంటే. అలాంటి సాయి పల్లవి ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
తనకు సంబంధించిన ఓల్డ్ వీడియో ఒకటి నెట్టింట చెక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతోంది. సాయి పల్లవి తనకు సంబంధించిన కాలేజ్ ఫెస్ట్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. అప్పట్లో ఇలానే విదేశాల్లో సాయి పల్లవి చదువుకుంటున్న రోజుల్లో వచ్చిన డ్యాన్స్ వీడియో ఒకటి అప్పట్లో ఊపేసింది. ఇక ఇప్పుడు షీలా కీ జవానీ అంటూ సాయి పల్లవి వేసిన స్టెప్పులు, ఊపేసిన తీరుకు జనాలు ఫిదా అవుతున్నారు. లేడీ మైఖెల్ జాక్సన్ అంటూ కితాబ్ ఇస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read:సల్మాన్ ఖాన్ ఇంటిబయట కాల్పులు, నిందితుడి గుర్తింపు
సాయి పల్లవి గతంలో ఢీ కంటెస్టెంట్‌గానూ వచ్చింది. ఢీ ఫీమేస్ స్పెషల్‌గా ఓ సీజన్ నడిచింది. ఆ సీజన్‌లో సాయి పల్లవి విన్నర్‌గా అయితే నిలవలేదు. అప్పుడు విన్నర్ కాలేదు కాబట్టే ఇప్పుడు నేషనల్ వైడ్‌గా క్రేజీ హీరోయిన్ అయినట్టుంది. కానీ ఆ షోలో ఓడిపోయినందుకు సాయి పల్లవి చాలా బాధపడిందట. అప్పట్లో సాయి పల్లవి స్టెప్పుల్ని అంతగా ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం సాయి పల్లవి డ్యాన్స్ అంటే అందరూ పడిపోతున్నారు.
ఇక సాయి పల్లవి కాలేజ్‌లో వేసిన షీలా కీ జవానీ స్టెప్పులు ఇప్పుడు అందరినీ కట్టిపడేస్తున్నాయి. సాయి పల్లవితో మామూలుగా ఉండదు. సాయి పల్లవి అంటే మినిమం ఉంటుందంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.తనకు సంబంధించిన వీడియో ఎలా బయటకు వచ్చిందన్న సంగతి మాత్రం తెలియడం లేదు.సాయి ఇక ఇదిలా ఉంటే సాయిపల్లవి హిందీ రామాయణంలో నటిస్తోందనే రూమర్లు వస్తున్న సంగతి తెలిసిందే. రాముడిగా రణ్ బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి కనిపించనున్నారట. ఇక సాయి పల్లవికి ఈ మూవీకి గానూ 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
#SaiPallavi in Sheela ki Jawani Song at her College Fest 🥵🥵🥵🥵🥵
— GetsCinema (@GetsCinema) April 16, 2024