Aadi Srinivas on Ramesh(image credit:X)
కరీంనగర్

Aadi Srinivas on Ramesh: చెన్నమనేనికి షాక్.. సీఐడీ కి ప్రభుత్వ విప్ ఫిర్యాదు!

Aadi Srinivas on Ramesh: భారత దేశ పౌరసత్వం లేకున్నా తప్పుడు పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన బీఆర్​ఎస్​ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేశ్​ పై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​ సీఐడీ డీజీ షిఖా గోయల్ కు ఫిర్యాదు చేశారు. తప్పుడు డాక్యుమెంట్ల సహాయంతో ఎన్నికల్లో పోటీ చేసిన చెన్నమనేని రమేశ్​ ను దోషిగా నిర్ధారిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని కూడా అందచేశారు.

ఈ మేరకు సీఐడీ అధికారులు చెన్నమనేని రమేశ్​ పై వేర్వేరు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. గతంలో వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్న చెన్నమనేని రమేశ్​ నిజానికి భారత దేశ పౌరుడు కాదని పదిహేనేళ్లుగా ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. దేశ పౌరసత్వం లేకున్నా తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించి ఎమ్మెల్యేగా గెలిచి జీతభత్యాలు అందుకున్న ఇలాంటి నాయకుడు దేశంలో మరెక్కడా లేరన్నారు.

దీనిపై ఆది శ్రీనివాస్​ గతంలోనే న్యాయస్థానంలో పిటిషన్​ దాఖలు చేశారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశారు. జర్మనీ దేశ పౌరుడైన చెన్నమనేని రమేశ్​ ఫోర్జరీ డాక్యుమెంట్లతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారని తెలిపారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు చెన్నమనేని రమేశ్​ భారత దేశ పౌరుడు కాదని గతంలోనే తీర్పునిచ్చింది. అయితే, దీనిని చెన్నమనేని రమేశ్ సవాల్​ చేశారు. దీనిపై జస్టిస్​ విజయ్​ సేన్ రెడ్డితో కూడిన బెంచ్​ విచారణ జరిపింది.

Also read: Mahesh Kumar Goud: మళ్లీ అధికారం మాదే.. పీసీసీ ఛీఫ్ కీలక వ్యాఖ్యలు!

చెన్నమనేని రమేశ్​ భారత పౌరుడు కాదని మరోసారి తేల్చి చెప్పింది. జర్మనీ పౌరుడని పేర్కొంది. తప్పుడు డాక్యుమెంట్లతో అధికారులు, న్యాయస్థానాలను 15 సంవత్సరాలుగా తప్పుదోవ పట్టించాడంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక, ఆది శ్రీనివాస్​ ఫిర్యాదు మేరకు చెన్నమనేని రమేశ్​ భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. తాజా తీర్పుపై అప్పీల్​ కు వెళ్లకుండా వెంటనే ఆది శ్రీనివాస్​ కు 25లక్షల రూపాయలు, హైకోర్టు లీగల్​ సర్వీసెస్ కమిటీకి 5లక్షల రూపాయలను చెల్లించాలని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తాజాగా చెన్నమనేని రమేశ్​ పై సీఐడీ డీజీ షిఖా గోయల్​ కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సీఐడీ అధికారులు చెన్నమనేని రమేశ్ పై ఐపీసీ 465, 468, 471 సెక్షన్లతోపాటు 1967 ఇండియన్ పాస్​ పోర్ట్ యాక్ట్ సెక్షన్ 12, 1946 ఫారినర్స్​ యాక్ట్​ సెక్షన్​ 14, 1955 ఇండియన్ సిటిజెన్ యాక్ట్ సెక్షన్​ 17 ప్రకారం కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అందచేయటానికి నేడు సీఐడీ కార్యాలయానికి రావాలని ఆది శ్రీనివాస్ కు సూచించారు.

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?