Mahesh Kumar Goud(image credit:X)
నిజామాబాద్

Mahesh Kumar Goud: మళ్లీ అధికారం మాదే.. పీసీసీ ఛీఫ్ కీలక వ్యాఖ్యలు!

Mahesh Kumar Goud: కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు పక్షపాత ప్రభుత్వం. రైతుకు భరోసా కల్పించి రైతును రాజును చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని పీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. వ్యవసాయ రంగం లో రైతులకు ఆధునాతన పద్ధతి లో వ్యవసాయం చేసే విధంగా రైతు మహోత్సవాలు నిజామాబాద్ లో ఏర్పాటు చేశాం. రైతు దేవుడు.. రైతులు బాగుంటేనే అందరం బాగుంటాం అని నమ్మేది కాంగ్రెస్ ప్రభుత్వం.

అలాంటి రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందన్నారు. రైతుల బాగుకోసం ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. రైతులకు ఏ ఆపద వచ్చినా ఆదుకుంటామని భరోసాగా ఉంటామని అన్నారు. రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టామని, భవిష్యత్తులో మరిన్ని పథకాలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గతం లో బీ ఆర్ ఎస్ హయాంలో ధాన్యం కుప్పల పై రైతులు మరణించారని, రైతుబందు పేరుతో దోచుకుందని, వందల కోట్లు లబ్ది చేకూర్చేలా గత ప్రభుత్వం భూస్వాములకు అండగా ఉందన్నారు.

గుట్టలకు, పుట్టలకు రైతు బందు పేరుతో దోచిపెడుతూ తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసి రాష్ట్రాన్నిఅప్పుల కుప్పగా మార్చారని ఫైర్ అయ్యారు. మోదీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు మద్దతు పలికిన బీ ఆర్ ఎస్ పార్టీ ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని రైతులకోసం మాట్లాడుతోందని , సన్నబియ్యం పండించాలని 500 బోనస్ ఇయ్యడం వల్ల సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రభుత్వం రైతులకు ఇస్తున్న ప్రోత్సాహం వల్లనే రాష్ట్రం లో వరి సాగు విస్తీర్ణం పెరిగింది. నిజామాబాద్ కు పూర్వ వైభవం కోసం అన్ని చర్యలు చేపట్టాం.

Also read: Jagga Reddy: మానవత్వం చాటుకున్న జగ్గారెడ్డి.. బాధితురాలికి సహాయం!

నిజాంసాగర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఆంధ్ర నుండి రైతులు నిజామాబాద్ వచ్చి స్థిరపడటమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్పారని, నిజాం హయాంలో రైతులను ప్రోద్బలం చేసి తీసుకొచ్చి ఎంకరేజ్ చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. నిజాం సాగర్ పూడిక ను తీసి ఆయకట్టు ను పెంచుతామన్నారు. బీ ఆర్ ఎస్ హయం లో వ్యవసాయ రంగం కోసం ఏం చేశారు. పదేళ్ల బీ ఆర్ ఎస్ హయం లో నిజామాబాద్ కు ఏం చేశారు. తెలంగాణ ను అభివృద్ధి పథం లో తీసుకెళ్లి మళ్ళీ 90నుండి 100 సీట్ల తో అధికారం లోకి వస్తాం.

జిల్లా లో బీ ఆర్ ఎస్ పని అయిపోయింది. భారత దేశం అంటేనే లౌకిక దేశం. లౌకికవాదం నమ్ముకున్న పార్టీలు వక్స్ చట్ట సవరణను వ్యతిరేకించాయి. వక్ఫ్ చట్టం పై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుందని బీజేపీ పార్టీ కుల మతాల మధ్య చిచ్చు పెడుతూ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తుందని, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అండగా ఉంటుందని తెలిపారు.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు