తెలంగాణ: Jagga Reddy: జగ్గారెడ్డి అంటే నిద్రలేసింది మొదలు అనునిత్యం రాజకీయాల్లో మునిగితేలే నాయకుడిగా పేరుంది. అయితే ఈ మధ్య కాలంలో ఓ సినిమాతో జగ్గారెడ్డి మన ముందుకు రాబొతున్నట్లు ఆయన ప్రకటించారు. రాజకీయాల్లో, తన నిజజీవితంలో జరిగిన సంఘటనలను తెరమీద చూపించబోతున్నాడు. రాజకీయం ఒక్కటే కాదు తన చుట్టూ ఉన్న వారికి కూడా సహయం చేస్తూ ప్రజాసంక్షేమం కోసం తపించే వ్యక్తిగా కూడా ఆయనకు పేరుంది.
క్యాన్సర్ బాధితురాలికి రూ.10 లక్షల నగదు సాయంను క్రాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి అందించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన ఆమని అనే మహిళ ఇంటికి వెళ్లి ఆయన పరామర్శించారు. బాధితురాలు చికిత్స కోసం ఇప్పటి వరకు రూ.7లక్షల వరకు అప్పులు చేశామని అన్నారు. భర్త చనిపోయాడని, ఇద్దరు ఆడపిల్లలతో దయనీయ జీవితం గడుపుతున్నానని విలపించిన ఆమని ఈ నరకం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని అన్నారు.
Also Read: Hyderabad: మత్తు దందాకు బలి! ముందే హెచ్చరించిన స్వేచ్ఛ
పిల్లల కోసం బతుకుతున్నానని చెప్పిన ఆమనికి తక్షణమే రూ.10 లక్షలు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అందించారు. సీఎం రేవంత్ రెడ్డి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించాలని తీసుకున్న నిర్ణయం మంచిదని జగ్గారెడ్డి అన్నారు. తనకు సాయం చేసి, వీడియోలు, ఫోటోలు తీయించుకునే అలవాటు నాకు లేదని జగ్గారెడ్డి అన్నారు. కానీ ఈ సమస్య పది మంది దృష్టికి తీసుకు రావాలని మీడియా దృష్టి కి తీసుకు వచ్చా అని అన్నారు.
రాష్ట్రంలో పేదలకు ఇలాంటి రోగాలు వస్తే కనీసం చికిత్స చేయించుకోవడానికి పైసలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి నిరుపేద క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచేందుకు దాతలందరూ ముందుకు రావాలని జగ్గారెడ్డి అన్నారు. క్యాన్సర్ బాధితులకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులు ట్రీట్ మెంట్ కోసం నిరుపేద క్యాన్సర్ బాధితులు పడుతున్న సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తప్పకుండా తీసుకెళతా అని జగ్గారెడ్డి అన్నారు.
Also Read: Mosquitoes Control In Hyd: హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్..జపాన్ తరహా శానిటేషన్!