Mosquitoes Control In Hyd (imagecredit:twitter)
హైదరాబాద్

Mosquitoes Control In Hyd: హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్..జపాన్ తరహా శానిటేషన్!

తెలంగాణ: Mosquitoes Control In Hyd: గ్రేటర్ హైదరాబాద్ లో వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ, జనాభాకు అనుకూలంగా ప్రజారోగ్య పరిరక్షణ కోసం జీహెచ్ఎంసీ దోమల నివారణకు సరి కొత్త విధానాన్ని అవలంబించేందుకు సిద్దమయింది. ప్రస్తుతం డీజీల్, మలాథిన్ మిశ్రమాన్ని ఫాగింగ్ చేస్తూ దోమల నివారణ చర్యలు చేపడుతున్న జీహెచ్ఎంసీ త్వరలోనే జపాన్ తరహాలో కెమికల్స్, మిషనరీని వినియోగించాలని భావిస్తుంది. ఇప్పటికే ఈ కూల్ ఫాగింగ్ ను బోరబండ ప్రాంతాల్లో చేపట్టిన జీహెచ్ఎంసీకి మంచి ఫలితాలు రావటంతో త్వరలోనే జోన్ కు ఓ వార్డును ఎంపిక చేసుకుని కూల్ ఫాగింగ్ ను చేపట్టాలని ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో అమల్లో ఉన్న జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానం ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే ఆరు జోన్లలో ఎంపిక చేసుకున్న ఆరు వార్డుల్లో ఈ కూల్ ఫాగింగ్ ను ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం మీనీ, పోర్టబుల్, వెహికల్ మౌంటెడ్ ఫాగింగ్ మిషన్లతో ఫాగింగ్ నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ త్వరలోనే సుమారు రూ.మూడున్నర లక్షల విలువ చేసే యంత్రాలతో కూల్ ఫాగింగ్ చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలిసింది. సాధారణ ఫాగింగ్ కన్నా ఈ కూల్ ఫాగింగ్ ఖరీదైనది కావటంతో ఫాగింగ్ కు జపాన్ కెమికల్స్, మిషనరీ, వెహికల్స్ ను వినియోగించాలని భావిస్తున్న ఎంటమాలజీ విభాగంలోనే భిన్నాభిప్రాయాలు విన్పిస్తున్నాయి. అసలే ఆర్థిక సంక్షోభంలో ఇంత ఖరీదైన కెమికల్స్, ఎక్కువ పెట్రోల్ అవసరమయ్యే వాహానాలున్న జపాన్ సిస్టమ్ అవసరమా? అన్న వాదనలు కూడా ఉన్నాయి.

కూల్ ఫాగింగ్ అంటే?

జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం డీజిల్ ప్లస్ మలాథిన్ కెమికల్ లిక్విడ్ ను స్ప్రే చేస్తూ దోమల నివారణ చేపడుతున్నారు. కానీ కూల్ ఫాగింగ్ అంటే నీటిలో మూడు రకాల రసాయనాలను కలిపి, లిక్విడ్ ను స్ప్రే చేయనున్నారు. సాధారణ డీజిల్ మలాథిన్ కెమికల్ లిక్విడ్ స్ప్రేతో కేవలం 80 శాతం మాత్రమే దోమల నివారణ జరుగుతుందన్న వాదనలుండగా, కూల్ ఫాగింగ్ తో మానవాళికి, పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేకుండా నూటికి నూరు శాతం దోమల నివారణ జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

Also Read: CM Revanth Reddy In Japan: మరో కొత్త ప్రపంచం మా దగ్గర సృష్టించండి.. రేవంత్ రెడ్డి

ఈ కూల్ ఫాగింగ్ లో బ్యారియన్ కెమికల్ తో పాటు మరో రెండు కెమికల్ ను వినియోగించిన లిక్విడ్ ను స్ప్రే చేయనున్నారు. బ్యారియన్ కెమికల్ తో పాటు ఇతర రెండు ఇతర కెమికల్స్ ఖరీదైన కెమికల్స్ కావటంతో ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ చేస్తున్న ఫాగింగ్ కన్నా కూల్ ఫాగింగ్ తో వ్యయం పెరగనున్నట్లు అంచనాలున్నాయి. జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం అధికారులు దోమల నివారణకు జపాన్ విధానం పేరిట సరి కొత్త దుబారా ఖర్చులకు తెరదీసినట్లు చర్చ జరుగుతుంది.

ఇదీ వ్యత్యాసాం

ప్రస్తుతం చేస్తున్న డీజిల్, ప్లస్ మిలాథిన్ కెమికల్ స్ప్రే కు సంబంధించి తొమ్మిదిన లీటర్ల డీజిల్ లో లీటరున్నర మాలాథిన్ ను కలిపి ఒక వాహానాన్ని వినియోగించి స్ప్రే చేస్తే చేస్తున్నారు. వాహానం నడిచేందుకు లీటరున్నర పెట్రోల్ తో ఒక్కో వాహానం సుమారు అయిదు నుంచి ఆరు కిలోమీటర్ల పొడువున స్ప్రే చేయవచ్చునని అధికారులు తెలిపారు. లీటర్ డీజిల్ రూ.వంద కాగా, మిలాథిన్ ఒక బ్యారెల్ రూ.200 లీటర్లు రూ.10 వేల వరకు ఖరీదు చేస్తుందని, ఇది సుమారు రెండు నెలల వరకు వినియోగించే అవకాశామున్నట్లు సమాచారం. అదే కూల్ ఫాగింగ్ లో వినియోగించే మూడు రకాల కెమికల్స్ లో ఒక్కో కెమికల్ రూ.3 వేలు విలువ చేస్తుందని,

వాటిని నీటిలో కలిపి పిచ్ కారి చేస్తే ఆశించిన స్థాయిలో దోమల నివారణ సాధ్యం కాదని ఎంటమాలజీ విభాగంలో టెక్నికల్ స్టాఫ్ చెబుతున్నా, అధికారులు ఈ ఖరీదైన కూల్ ఫాగింగ్ ను ఎందుకు తెరపైకి తెచ్చారన్నది చర్చనీయాంశంగా మారింది. పైగా మూడు రకాల కెమికల్స్ కలిపిన లిక్విడ్ ను స్ప్రే చేసేందుకు జపాన్ మిషన్ మౌంటెడ్ వాహానం మూడు లీటర్ల పెట్రోల్ కు కేవలం అయిదుకిలోమీటర్లే ప్రయాణిస్తుందని, డిల్లీలో ఉన్న జపాన్ ఫాగింగ్ మిషన్ల కొనుగోళ్లలో కమీషన్ల కోసమే ఈ విధాన్ని పరిచయం చేస్తున్నారే తప్పా, నిజంగా దోమల నివారణ కోసమేమీ కాదన్న వాదనలున్నాయి.

Also Read: Viral News: ఏం తెలివి.. భలే బురిడీ కొట్టించిందిగా.. అసలు విషయం ఇదే!

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు