MLA Gaddam Vivek (imagecredit:swetcha)
ఆదిలాబాద్

MLA Gaddam Vivek: గత పాలకుల నిర్లక్ష్యం.. నేటికి మోక్షం.. ఎమ్మెల్యే గడ్డం వివేక్

మంచిర్యాల స్వేచ్ఛ: MLA Gaddam Vivek: గత బిఆర్ఎస్ పాలకుల నిర్లక్ష్యం వల్లనే రామకృష్ణాపూర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణం పనులు నిలిచిపోయాయని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు. రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ నుండి మంచిర్యాలకు వెళ్లే రైల్వే బ్రిడ్జిని పెద్దపల్లి ఎంపీ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ 2018 సంవత్సరంలో రైల్వే బ్రిడ్జిని ప్రారంభించినట్లు తెలిపారు.

భూ నిర్వాసితులకు 8 కోట్ల రూపాయల పరిహారం చెల్లింపు విషయంలో గత ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎంపీ వెంకటేష్ నేతలు చొరవ చూపలేకపోవడంతో ఆలస్యం జరిగినట్లు వెల్లడించారు. తాము ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తరగతిన బ్రిడ్జికి నిధులు మంజూరు చేపించి అడ్డంకులను తొలగించామన్నారు. రైల్వే బ్రిడ్జి ప్రారంభంతో ప్రజల కష్టాలు తొలగిపోయాయని ఆనందం వ్యక్తం చేశారు. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రజలకు రైలు ప్రయాణం తక్కువ చార్జీలతో రాకపోకలకు మరికొన్ని రైళ్లను హాల్టింగ్ కొరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కరోనా సమయంలో నిలిచిన అజ్ని ప్యాసింజర్ రైలు కాజీపేట నుండి నాగపూర్ వరకు రైల్వే జీఎం తో మాట్లాడి మళ్లీ పునరుద్ధరించడం జరిగిందని పేర్కొన్నారు.

Also Read: CM Revanth Reddy: గుడ్ న్యూస్.. ఇకపై సీఎం కనుసన్నల్లో ప్రజావాణి.. కష్టాలు తీరినట్లే!

కాకా గడ్డం వెంకట స్వామి చలవ వల్లనే సింగరేణి బొగ్గు గని కార్మికులకు పెన్షన్ వచ్చిందని చెప్పారు. గత 20 సంవత్సరాలుగా సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంపు విషయాన్ని పార్లమెంటులో ఎవరు మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ విరమణ పొందిన ప్రతి కార్మికుడికి 10 వేల రూపాయలు పెన్షన్ చెల్లించాలని పార్లమెంటులో మాట్లాడి సంబంధిత మంత్రికి వినతిపత్రం కూడా అందజేసినట్లు చెప్పారు. ఎన్ హెచ్ 63 రోడ్డు పనులకు అటవీ శాఖ అనుమతులు వచ్చాయని ఎంపీ పేర్కొన్నారు.

ఈ రోడ్డు పనులు పూర్తయితే ప్రజలకు రాకపోకలు సులువైపోతుందని అన్నారు. అనంతరం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ ఈ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రెయినేజీలు, మంచినీటి సౌకర్యార్థం కొరకు స్పెషల్ డెవలప్మెంట్ నిధులు మంజూరు చేపించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని హామీ ఇచ్చారు. అలాగే విద్యా, వైద్య రంగానికి పెద్ద పీట వేస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో రెండు వందల కోట్ల రూపాయలతో నూతన ఓరవడితో విద్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు వివరించారు.

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ప్రజలకు రేషన్ కార్డు ద్వారా అందజేస్తున్న సన్నబియ్యం, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్, ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ ల లో ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, టిపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, అధికార ప్రతినిధి శ్రీనివాస్, మాజీ చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, యాకూబ్ అలీ, నీలం శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు