Trump Tariffs (imagecredit:AI)
కరీంనగర్

Trump Tariffs: మామిడి రైతులకు గుడ్ న్యూస్.. వాటిపై సుంకాలుండవు!

కరీంనగర్‌ బ్యూరో స్వేచ్ఛః Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ రైతులకు ఊరట లభించింది. ట్రంప్‌ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రపంచ దేశాలపై సుంకాలు పెంచుతు అందరన్ని అదరగోడుతున్నాడు. ఇటీవల అమెరికాకు ఎగుమతి అవుతున్న వివిధ దేశాల వస్తువులపై ట్రంప్‌ పెద్ద ఎత్తున సుంకాలు పెంచిన విషయం తెలిసింది.

ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంతో తీవ్ర వ్యతిరేకత రావడం 90 రోజుల పాటు సుంకాలను నిలివేస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల మామిడి రైతులకు ఈ సీజన్‌లో ఊరట లభించినట్లు అయింది.

మామిడిపై 28శాతం సుంకాలు..

మనదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న మామిడి పండ్లపై ట్రంప్‌ 28 శాతం సుంకాలు విధించాడు. గతంలో మామిడి పండ్లపై 0.5 శాతం మాత్రమే సుంకాలు ఉండగా ఈసారి ట్రంప్‌ నిర్ణయంతో మామిడి పండ్లపై భారీగా సుంకాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనదేశం నుంచి అమెరికాకు ప్రతియేటా మన దేశం నుంచి 45వేల టన్నుల మామిడి పండ్లు ఎగుమతి అవుతుండగా తెలుగు రాష్ట్రాల నుంచి 15 వేల టన్నుల వరకు మామిడి పండ్లు ఎగుమతి అవుతుంటాయి.

మామిడి ఎగుమతుల ద్వార ప్రతియేటా రూ. 130 కోట్ల వరకు వ్యాపారం జరగుతుందని ఒక అంచనా ఉండి. మామిడి పండ్లపై 28 శాతం సుంకాలు విధించాలని ట్రంప్‌ నిర్ణయంతో ప్రస్తుతం మామిడి పంట చేతికి రావడంతో ఎగుమతులు అవుతాయో లేదో అనే మామిడి రైతులు అనుమానం వ్యక్తం అయింది.

ఎగుమతులు తగ్గిపోతే స్థానిక మార్కెట్‌లో అనుకున్న స్థాయిలో ధరలు వచ్చే పరిస్థితి లేదని రైతులు అందోళన చెందారు. అయితే 90 రోజుల నిర్ణయంతో ఈసారి సీజన్‌లో మామిడి ఎగుమతులు ఏదావిధిగా ఉంటాయని రైతులు ఆశిస్తున్నారు.

Also Read: Wines Close in Hyderabad: మందుబాబులకు బిగ్ షాక్.. ఈ వీకెండ్ లోనూ మందు లేనట్లే!

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!