Wines Close in Hyderabad (Image Source: AI)
హైదరాబాద్

Wines Close in Hyderabad: మందుబాబులకు బిగ్ షాక్.. ఈ వీకెండ్ లోనూ మందు లేనట్లే!

Wines Close in Hyderabad: హైదరాబాద్ లోని మందుబాబులకు వరుసగా రెండో వారం షాక్ తగిలింది. హనుమాన్ జయంతి (Hanuman Jayanthi)ని పురస్కరించుకొని ఏప్రిల్ 12న అన్ని వైన్ షాపులు మూతపడతున్నారు. ఈ మేరకు నగర కమీషనర్ సీవీ ఆనంద్ (CV Anand) ఆదేశాలు జారీ చేశారు. ఆ రోజున నగరమంతా జై హనుమాన్ నినాదాలతో మార్మోగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసులు.. ఈ నిర్ణయం తీసుకున్నారు.

జంట నగరాల్లో..
ఏప్రిల్ 12న ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 6 గంటల వరకూ మద్యం దుకాణాలను మూసీవేయాల నగర కమీషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. జంటనగరాల్లోని మద్యం దుకాణాల యజమానులు తప్పనిసరిగా ఈ ఆదేశాలను పాటించాలని సూచించారు. లేని పక్షంలో చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

గతవారం కూడా..
గత ఆదివారం శ్రీరామనవమి (Sri Rama Navami)ని పురస్కరించుకొని హైదరాబాద్ నగరంలో (Hyderabad City) మద్యంపై ఆంక్షలు విధించారు. ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ నిషేధం విధించారు. దీంతో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలంతా చాలా ప్రశాంత వాతావరణంలో పండగను జరుపుకున్నాయి. ఈ క్రమంలో హనుమాన్ జయంతిని కూడా భక్తులు అంగరంగ వైభవంగా.. ఎలాంటి వివాదాలు లేకుండా జరుపుకోవాలన్న ఉద్దేశ్యంతో పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

Also Read: Janasena on Kavitha: పవన్ తో పెట్టుకున్న కవిత.. ఏకిపారేస్తున్న జనసైనికులు.. మరీ ఇంత ఘోరంగానా!

రాష్ట్రానికి కొత్త బ్రాండ్లు
ఇదిలా ఉంటే తెలంగాణ బెవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్ కొత్త మద్యం బ్రాండ్ల కోసం జారీ చేసిన ప్రకటనకు ఊహించని రీతిలో కంపెనీల నుంచి స్పందన వచ్చింది. కొత్తగా 644 బ్రాండ్లు సరఫరా చేస్తామంటూ కంపెనీలు, సరఫరాదారులు ముందుకు వచ్చారు. వీటిలో 371 రకాల ఇండియన్ మేడ్​, 273 రకాల ఫారిన్​ మేడ్​ లిక్కర్​ బ్రాండ్లు ఎక్సయిజ్​ శాఖ కమిషనర్​ హరికిరణ్​ తెలిపారు. వీటిలో 386 బ్రాండ్ల మద్యం విక్రయించటానికి 47 కొత్త కంపెనీలు దరఖాస్తు చేసినట్టుగా పేర్కొన్నారు. మరో 218 బ్రాండ్ల మద్యం అమ్మకాలకు 45 పాత కంపెనీలు అప్లయ్​ చేసుకున్నట్టు వివరించారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు