Jagtial Student in ISRO: ఆదర్శ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినికి అరుదైన అవకాశం దక్కింది. ఏకంగా ఇస్రో నిర్వహిస్తున్న యంగ్ సైంటిస్ట్ కార్యక్రమంలో పాల్గొనే ఛాన్స్ కొట్టేసింది. ఆదర్శ పాఠశాలలు ఆదర్శమే అని చెప్పేందుకు ఈ విద్యార్థిని చక్కని ఉదాహరణ.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రనికి చెందిన విద్యార్థిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నిర్వహిస్తున్న యువిక -2025, యంగ్ సైంటిస్ట్ కార్యక్రమానికి కొడిమ్యాల ఆదర్శ పాఠశాల చెందిన 9 వ తరగతి చదువుతున్న విద్యార్థిని కొలకాని అశ్విని ఎంపికైనట్లు ప్రిన్సిపల్ లావణ్య తెలిపారు.
దేశవ్యాప్తంగా ఇస్రోకు చెందిన 8 పరిశోధన కేంద్రాలలో మే నెలలో పన్నెండు రోజుల పాటు అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించిన శిక్షణ ఇవ్వనున్నారు. దీనికిగాను అశ్విని హైదరాబాద్ లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లో జరిగే శిక్షణకు ఎంపికైంది. తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికైన పన్నెండు మంది విద్యార్థులలో అశ్విని ఒకరు.
Also Read: BRS Politics: గులాబీ పార్టీలో ముసలం.. ఆ నేతకు చెక్ పెట్టేందుకేనా?
వివిధ రకాల అంశాలు, ఆన్లైన్ పోటీ చదువులో చూపిన ప్రతిభ ఆధారంగా అశ్విని ఈ కార్యక్రమానికి ఎంపికైంది. తమ విద్యార్థిని ఇస్రో యువిక కార్యక్రమానికి ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రిన్సిపల్ బి లావణ్య సంతోషంవ్యక్తం చేసారు. ఆదర్శ పాఠశాల విద్యార్థులను అన్ని రంగాలలో ప్రోత్సహిస్తున్నట్లు ప్రిన్సిపల్ లావణ్య తెలియజేసారు. అశ్విని ని పాఠశాల ప్రిన్సిపల్ తో పాటు గ్రామ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ఉపాధ్యాయులు ప్రశంసించారు.