BRS Politics(image credit:X)
Politics

BRS Politics: గులాబీ పార్టీలో ముసలం.. ఆ నేతకు చెక్ పెట్టేందుకేనా?

BRS Politics: గులాబీ పార్టీలో అసలు ఏం జరుగుతుందనే అంతుచిక్కడం లేదు. పార్టీలో ఇద్దరు కీలక వ్యక్తులే. అయినప్పటికీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హరీష్ రావు మాత్రం ఎమ్మెల్యేగా, సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన ప్రియార్టీ రోజురోజుకు తగ్గిస్తున్నారా? అనే ప్రశ్న పార్టీ కేడర్ లోనే జోరుగా సాగుతుంది. హరీష్ రావు యాక్టీవ్ అయితే కేటీఆర్ కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయనేది పార్టీ అధిష్టానం భావిస్తుందా? అనే ప్రశ్న తలెత్తుతుంది. తొలుత వరంగల్ సభ బాధ్యతలు హరీష్ రావుకు అని పార్టీ నేతలకు చెప్పి ఇప్పుడు కేటీఆర్ కు అప్పగించడం తో పార్టీలో హాట్ టాప్ గా మారింది.

ఎవరి ఊహకందని నిర్ణయాలు తీసుకోవడంతో గులాబీ అధినేత కేసీఆర్ దిట్ట. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. చివరి నిమిషంలో సైతం తన నిర్ణయాలు మార్చుకొని షాక్ ఇస్తుంటారు. తెలంగాణ భవన్ లో ఫిబ్రవరి 19న పార్టీ విస్తృత సమావేశంలో వరంగల్ లో నిర్వహించే పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సభ బాధ్యతలను హరీష్ రావుకు అప్పగిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఆయనే సభ కమిటీలు వేయడంతో పాటు అన్ని జిల్లాల నేతలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారని, అన్ని వర్గాలను కమిటీల్లో భాగస్వాములను చేయనున్నట్లు ప్రకటించారు. మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలోనూ కోఆర్డినేషన్ కమిటీలు వేయనున్నట్లు తెలిపారు.

Also read: Hydra on Alwal: అక్రమాలపై రంగనాథ్ దృష్టి .. స్మశానవాటికకు రక్షణ

కానీ హరీష్ రావు మాత్రం సిద్దిపేట జిల్లాలోనే కనిపిస్తున్నారు. ఆయన సొంత నియోజకవర్గంలోనే సన్నాహక సమావేశాలు, పలు పార్టీకార్యకర్తలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహించకుండా కేవలం నియోజకవర్గానికే పరిమితం కావడం ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. హరీష్ రావును సిద్దిపేటకే పరిమితం చేశారనే ప్రచారం జరుగుతుంది. కేసీఆర్ సభ బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించారనే ప్రచారం ఊపందుకుంది.

కేటీఆర్ కు అప్పగింత
వారం రోజులపాటు ఎర్రవెల్లి ఫాం హౌజ్ లో పార్టీ అధినేత కేసీఆర్ ఉమ్మడి జిల్లాల్లోని ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. జిల్లాలో రాజకీయ పరిస్థితులు, సభకు జనం తరలింపు తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశాల్లో కేటీఆర్, హరీష్ రావు పాల్గొన్నారు. తక్కువ సమావేశాల్లో హరీష్ రావు పాల్గొన్నారనే ప్రచారం జరుగుతుంది. ఆ సమావేశాల అనంతరం కేటీఆర్ సభపై ఫుల్ ఫోకస్ పెట్టారు. పార్టీ నేతలతో భేటీలు నిర్వహిస్తూ సూచనలు చేస్తున్నారు. దీంతో సభ బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించినట్లు తెలిసింది. అందుకే ఆయన స్పీడ్ పెంచారని, మళ్లీ జిల్లాల పర్యటనకు సైతం వెళ్లనున్నట్లు సమాచారం.

ఎక్కడైతే పార్టీ వీక్ గా ఉంటుందని సమాచారం తెలిస్తే ఆ జిల్లాకు గానీ, ఆ నియోజకవర్గానికి గానీ వెళ్లి పార్టీనేతలతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేయబోతున్నారని సమాచారం. పార్టీ సభ విజయవంతం చేసే బాధ్యతలను హరీష్ రావు కు కాకుండా కేటీఆర్ కు అప్పగించడం హాట్ టాపిక్ గా మారింది.

అధినేత ఆలోచన ఏంటి?
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ వ్యవహరిస్తున్నారు. అధినేత కేసీఆర్ అందుబాటులో లేకుంటే అన్ని పార్టీ కార్యక్రమాలను కేటీఆర్ చూసుకుంటారని గతంలో నిర్వహించిన ప్లీనరీలోనే ప్రకటించారు. అయితే హరీష్ రావు కు మాస్ ఫాలోయింగ్ ఉండటం, ట్రబుల్ షూటర్ గా పేరుంది. ఆయనను మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటింప జేస్తే మరింత బలమైన నేతగా ఎదిగే అవకాశం ఉందని భావించి సభా బాధ్యతల నుంచి తప్పించారా? అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. భవిష్యత్ లో కేటీఆర్ ను పార్టీలో కీలకంగా చేయాలంటే ఇబ్బంది కర పరిస్థితులు వచ్చే అవకాశం ఉండటంతోనే అధినేత ఆలోచన చేశారా? అనేది చర్చ మొదలైంది. అందుకే సభ బాధ్యతలను తిరిగి కేటీఆర్ కు అప్పగించారనే ప్రచారం జరుగుతుంది.

మెదక్ కు హరీష్ రావును పరిమితం
హరీష్ రావును పార్టీలో కట్టడి చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. కేవలం మెదక్ కు పరిమితం చేస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తే ఇబ్బంది కరపరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో పార్టీ అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చ పార్టీలో మొదలైంది. కేసీఆర్ తర్వాత పార్టీలో నెక్స్ట్ లీడర్ ఎవరంటే కేటీఆర్ అనేది నేతల్లో రావాలని అందుకే మరింత యాక్టీవ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. అధికారంలో ఉన్నప్పుడు సైతం కొంతమంది మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన నేతలు సభా వేదికపైనే సీఎం కేటీఆర్ అనే వ్యాఖ్యలు చేశారు. దీనిపై అప్పట్లో కేసీఆర్ సైతం సీరియస్ అయ్యి నేతలను మందలించిన ఘటనలు ఉన్నాయి.

భవిష్యత్ ను దృష్టిలు ఉంచుకొని పార్టీ అధినేత కేసీఆర్ పావులు కదుపుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందులో భాగంగానే హరీష్ రావును మెదక్ కు పరిమితం చేశారని ప్రచారం విస్తృతంగా జరుగుతుంది.వరంగల్ సభ నేపథ్యంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు హాట్ టాపిక్ గా మారాయి. అసలు పార్టీలో ఏం జరుగుతుంది. ఎవరికి ప్రాధాన్యం ఇస్తున్నారు. హరీష్ రావు కు పార్టీలో పాత్ర ఏంటి? ఆయన సైతం ఏం చేయబోతున్నారనేది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

సభ్యత్వం, కమిటీల బాధ్యత సైతం కేటీఆర్ కే?
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మేలో చేపట్టబోతున్నారు.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ బాధ్యతలను నిర్వహించబోతున్నారు. గ్రామ, వార్డు, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర కమిటీలు సైతం ఆయనే వేయబోతున్నట్లు సమాచారం. పార్టీని స్థంస్థాగతంగా నిర్మాణం చేయబోతున్నారు. అందుకే కేటీఆర్ ముందుండి పార్టీని నడిపించనున్నట్లు తెలిసింది. అదే విధంగా పార్టీ కేడర్ కు శిక్షణ కార్యక్రమాలను సైతం కేటీఆర్ ఆధ్వర్యంలోనే నిర్వహించబోతున్నట్లు సమాచారం.

పార్టీ వ్యవహారాలు అన్నీ కేటీఆర్ చక్కబెడితే ఆయన నాయకత్వంలోనే నాయకులు పనిచేసే అవకాశం ఉంది. అందుకే ఇప్పటి నుంచే పార్టీలో కింగ్ మేకర్ గా కేటీఆర్ ను చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కేటీఆర్, హరీష్ రావులు ఎక్స్ వేదికగా పోటాపోటి ట్విట్ లు సైతం జోరుగా చర్చజరుగుతుంది.

స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

 

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్