jagtial mango farmers: దళారుల దందా నిలిపివేయండి .. మా మొర ఆలకించండి.. కలెక్టర్ కు రైతుల విన్నపం
Jagityal mango farmers image credit: swetcha reporter]
కరీంనగర్

jagtial mango farmers: దళారుల దందా నిలిపివేయండి .. మా మొర ఆలకించండి.. కలెక్టర్ కు రైతుల విన్నపం

jagtial mango farmers: నాణ్యతలో జాతీయ మార్కెట్‌లో పేరు ప్రఖ్యాతలు గాంచిన జగిత్యాల మామిడి ని బహిరంగ వేలం వేసి కొనుగోలు చేయాలని జగిత్యాల మామిడి రైతులు, ఐక్యవేదిక నాయకులు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. మామిడి రైతులకు దళారుల సమస్య తప్పించి బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేయాలని రైతులు కోరారు.

సందర్భంగా రైతు ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ స్థానిక వ్యాపారులతో పాటు ఆయా నగరాల నుంచి ఇక్కడికి మామిడి కొనుగోలు కోసం నెలరోజుల ముందే దళారులు వస్తారని,ముంబై,ఢిల్లీ పండ్ల మార్కెట్‌ వ్యాపారులు దళారులను రంగంలోకి దించి చౌకగా మామిడి కొనుగోలు చేస్తు,రైతులను నిలువు దోపిడి చేస్తున్నారని ఐక్య వేదిక నాయకులు వాపోయారు.

 Also Read: Telangana RTC: ఆర్టీసీలో ఏడడుగుల బుల్లెట్.. అతడిపై సీఎం రేవంత్ ఫోకస్.. మంత్రి కీలక ఆదేశాలు!

దళారుల దందా..

మామిడి కాయలను ప్రత్యేక బాక్సుల్లో ప్యాకింగ్‌ చేసి లారీలు, కంటైనర్లలో ఢిల్లీ, ముంబై ప్రాంతాలకు ఎగుమతులు చేస్తున్నారు. మామిడి తోటలు పూత, పింద దశలోనే ఈ దళారులు రైతులతో మాట్లాడుకొని నేరుగా తోటలకు వెళ్లి కాయలను కూలీలతో కోయించి జగిత్యాల మామిడి మార్కెట్ సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న అడ్డాలకు తరలించి అక్కడ బాక్సుల్లో ప్యాకింగ్‌ చేసి ఎగుమతి చేస్తున్నారు.

ఈసారి మామిడి దిగుబడి గణనీయంగా పడిపోయింది.వాతావరణంలో సంభవించిన మార్పుల కారణంగా పూతదశలోనే రాలిపోయింది. దీంతో కేవలం 20-30 శాతం మాత్రమే మామిడి దిగుబడి రావడంతో రైతుకు నిరాశే మిగిలింది.. దానికి తోడు దళారుల మాయజాలంతో రైతులు తీవ్రంగా నష్టం చవిచూడాల్సి వస్తుంది.

Anakapalle Road Accident: ఎదురెదురుగా ఢీకొన్న లారీ – వ్యాన్.. ఇద్దరు స్పాట్ డెడ్.. మరికొందరికి..!

కాయ పరిమాణం తగ్గిందంటూ సాకులు చెప్పి మార్కెట్‌ ధర కంటే తక్కువ ధర చెల్లించి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. అడ్డాల్లో ముంబయి, ఢిల్లీ రాష్ర్టాల నుంచే కూలీలను ఇక్కడికి రప్పించి ,మామిడి కాయల సైజ్‌లను బట్టి ఏ, బీ గ్రేడ్‌ చొప్పున బాక్సుల్లో ప్యాక్ చేసి పంపుతారు, ఈ సారి దిగుబడి పడిపోవడంతో ఉద్యానశాఖ అధికారులు కూడా దిగుబడిని అంచనా వేయలేకపోతున్నారు.

ఓ వైపు వాతావరణ పరిస్థితులు, మరో వైపు దళారుల మాయజాలంతో మామిడి రైతు తీరు అగామ్య గోచరంగా తయారైంది.. ఇప్పటికే అనేక చోట్ల మామిడి రైతులు పెట్టుబడి అధికం కావడంతో దిగుబడులు రాక నష్టాలను భరించలేక చెట్లను తొలగిస్తున్నారు.. రాబోయే కాలంలో మామిడి మార్కెట్ కు పేరు గాంచిన జగిత్యాల ప్రాంతంలో మామిడి తోటలు కనుమరుగయ్యే పరిస్థితి లేకపోలేదు.. ప్రభుత్వం రంగంలోకి దిగి దళారుల చేతిలో ఉన్న మామిడి కొనుగోలును బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేయాలని రైతులు, ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!