Khammam District: పోటీ పరీక్షలలో అభ్యర్ధులు ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, వాటి సాధన దిశగా పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ఖమ్మం బైసాస్ రోడ్ లోని జలగం వెంగళరావు తెలంగాణ బిసీ స్టడీ సర్కిల్ ను సందర్శించారు.
గ్రూప్ డి, న్యాయ విభాగం, జూనియర్ లెక్చరర్, రైల్వేే రిక్రూట్మెంట్ బోర్డు, ఐ.డీ.బి.సి. వంటి వివిధ రకాల పోటీ పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్ధులతో జిల్లా కలెక్టర్ ముచ్చటించారు.
ఏ పోటీ పరీక్షలకు సన్నద్దం అవుతున్నారు, ఎటువంటి పుస్తకాలు కావాలి, ఇంకా ఏమైనా అవసరాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వారు అడిగిన వాటర్ కూలర్స్, స్టడీ చైర్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పోటీ పరీక్షలకు సంబంధించి అప్ డేట్ అయిన పుస్తకాలను ఉంచాలని, అవసరమైన పుస్తకాల జాబితాను తయారు చేసి వెంటనే అందించాలని కలెక్టర్ నిర్వాహకులకు సూచించారు.చిన్నతనంలో తాను సాధారణ విద్యార్థి మాత్రమేనని, 10వ తరగతి నుంచి తండ్రి తీసుకున్న శ్రద్ద కారణంగా బాగా చదివానని అన్నారు.
డిగ్రీ తర్వాత జీవితంలో ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని సివిల్స్ పాస్ అయ్యానని అన్నారు. మనకు ఉన్న సామర్థ్యంతో పాటు సరైన సమయంలో కష్టపడి పని చేయడం చాలా అవసరమన్నారు. మనం గొప్ప స్థాయికి ఎదిగిన తర్వాత సమాజంలోని పదిమందిని ఆదుకొని వారు కూడా ఉన్నతస్థాయికి చేరుకునేలా కృషి చేయాలని అన్నారు. మనతో మనం పోటీపడుతూ మన ఉన్నతికి మనమే ముందుకు బాటలు వేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు