mahabubabad distrcit: నియోజకవర్గంలో రూ.12 కోట్లతో ఎస్టీ ఎస్ డి ఎఫ్ ఫండ్, రూ.34 కోట్లతో సిఆర్ఆర్ ఫండ్, రూ.12. 50 కోట్ల ఎం ఆర్ ఆర్ ద్వారా నిధులతో సిసి రోడ్లు, అనుసంధాన రహదారులతో పాటు వివిధ రకాల అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. అంతేకాకుండా రూ.15 కోట్లతో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులతో నియోజకవర్గంలోని మహబూబాబాద్ నెల్లికుదురు కేసముద్రం గూడూరు ఇనుగుర్తి మండలాల్లో సిసి రోడ్లు వివిధ రకాల అభివృద్ధి పనులు సాగుతున్నాయి.
కురవి జాతీయ రహదారి 365 ఆనుకొని ఉన్న బేతోలు గ్రామం నుండి మహబూబాబాద్ ఆనుకుని ఉన్న మంగళ కాలనీ సమీపం నుంచి వెళ్లే భద్రాద్రి కొత్తగూడెం నుండి వలిగొండ వరకు వెళ్లే జాతీయ రహదారి 930పి కి అనుసంధానం చేసేందుకు 18 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణ పనులను సాగుతున్నాయి. అదే విధంగా గూడూరు మండలం జగన్నాయకులగూడెం నుండి అప్పరాజుపల్లి, గోవిందాపురం మీదుగా తాళ్లపాటి నాయక్ పెళ్లి వరకు రూపాయలు 18 కోట్లతో రహదారి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
మరింత అభివృద్ధి కోసం
మహబూబాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే రూ.135 కోట్లతో ఓ ఆర్ ఆర్ కోసం ప్రతిపాదనలు పంపారు. ఈ నిధులు సైతం త్వరలోనే మంజూరు కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. మహబూబాబాద్ పట్టణం చుట్టూ 10.5 కిలోమీటర్ల దూరంతో ఔటర్ రింగ్ రోడ్డు పనులను అతి త్వరలోనే ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.
ముఖ్యంగా ఓ ఆర్ ఆర్ ద్వారా మహబూబాబాద్ పట్టణానికి పట్టిన ట్రాఫిక్ కష్టాలు పూర్తిస్థాయిలో వైదొలుగుతాయని అంచనా నేపథ్యంలో ఈ రహదారి నిర్మాణం చేసుకోనుంది. ఓ ఆర్ ఆర్ ను పూర్తిగా పట్టణం నలువైపులా నుండి వెళ్లే జాతీయ రహదారులను కలుపుకునేలా అధికారులు ప్రణాళిక రచించారు. దీంతో మహబూబాబాద్ నడిబొడ్డు నుండి ఇతర మహా నగరాలకు వెళ్లే హెవీ వెహికిల్స్ తిప్పలు తప్పనున్నాయి. ఈ మేరకు మున్సిపాలిటీ అధికారుల ఆధ్వర్యంలో ప్రాథమిక సర్వే సైతం నిర్వహించినట్లు చెబుతున్నారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం యు ఐ డి ఎఫ్ ఫండ్స్ కోసం రూ.236 కోట్ల ప్రతిపాదన
మేజర్ గ్రామపంచాయతీ గా ఉన్న మహబూబాబాద్ అతివేగంగా మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయి తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా జిల్లాగా పేరు మార్చుకుంది. అప్పటినుండి తన రూపును మార్చుకుంటూ మహానగరాలకు దీటుగా అభివృద్ధి బాట పట్టింది. ఇటీవల కురిసిన వర్షాలకు పట్టణమంతా అల్లకల్లోలం కావడంతో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదనలు పంపించారు.
ఈ అండర్ గ్రౌండ్ కోసం అర్బన్ ఇంట్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (యుఐడిఎఫ్) కింద రూ.236 కోట్లతో ఎస్టిమేషన్ వేసి ప్రతిపాదనలను ఢిల్లీకి పంపారు. అతి త్వరలోనే ఈ నిధులు మొత్తం మంజూరీ రూపంలో మహబూబాబాద్ చేరనున్నాయి. ఈ నిధులతో మహబూబాబాద్ పట్టణాన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఖర్చు చేయనున్నారు.
దాశరధి స్మృతి వనం లిటికేషన్ క్లియర్
తొలి తెలంగాణ ప్రభుత్వంలో వివిధ విమర్శలకు దారి తీసిన దాశరధి స్మృతి వనంలో ఉన్న లిటిగేషన్ కోర్టు ద్వారా క్లియర్ అయిందని అధికారులు చెబుతున్నారు. ఈ స్మృతి వనంలో విశాలమైన స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి పబ్లిక్ ప్రైవేట్ నిధులతో నిర్మాణానికి కృషి ప్రజా ప్రతినిధులు అధికారులు కృషి చేస్తున్నారు.
Also read: Nizamabad Collector: కలెక్టర్ అకస్మిక తనిఖీలు.. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కీలక ఆదేశాలు
శృతి వనానికి సంబంధించిన దాదాపు 9 ఎకరాల చిల్లర ప్రభుత్వ భూమిని కోర్టు ద్వారా క్లియర్ చేసినట్లుగా చెబుతున్నారు. అతి త్వరలోనే ఈ స్మృతి వనం చుట్టూ ప్రహరీ నిర్మాణంతో పాటు అందులో వివిధ రకాల ప్రజలు ఉపయోగించుకునేందుకు విశాలమైన స్విమ్మింగ్ పూల్ నిర్మించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇంటిగ్రేటెడ్ పాఠశాల, పాలిటెక్నిక్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల మంజూరులో భాగంగా మహబూబాబాద్ కు సైతం ఓ ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు అయింది. ఈ పాఠశాలను బొద్దుగొండ ప్రాంతంలో నిర్మించేందుకు అధికారులు సర్వేలు, ప్రణాళికలు చేసినట్లు వివరిస్తున్నారు.
అంతేకాకుండా రాష్ట్రంలోనే ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో లేని పాలిటెక్నిక్ రెసిడెన్షియల్ కళాశాలను కేసముద్రం మండలానికి సాంక్షన్ చేయించినట్లు ప్రజాప్రతినిధులు వివరిస్తున్నారు. కేసముద్రం మండల కేంద్రంలోని మోహన్ టాకీస్ నుండి దర్గా వరకు సెంట్రల్ డివైడర్ ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్ ను పెట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తుల పనిచేస్తున్న. ఇప్పటికే నియోజకవర్గంలో దాదాపు 125 కోట్లతో అభివృద్ధి పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. మహబూబాబాద్ చుట్టూ ఓ ఆర్ ఆర్ కోసం రూ.135 కోట్లు నిధుల మంజూరి కోసం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉంది. మహబూబాబాద్ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం రూ.236 కోట్లతో ప్రతిపాదనలు పంపాము. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోని దాశరధి స్మృతి వనం లో ఉన్న లిటికేషన్ క్లియర్ అయింది. త్వరలోనే స్తుతివను డెవలప్మెంట్ కోసం పనులను ప్రారంభిస్తామని తెలిపారు.