Meenakshi Natarajan (Image Source: Twitter)
తెలంగాణ

Meenakshi Natarajan: హెచ్ సీయూ వివాదంపై ఏఐసీసీ ఫోకస్.. రంగంలోకి మీనాక్షి నటరాజన్.. సమస్యకు చెక్ పెడతారా?

Meenakshi Natarajan: హెచ్ సీయూకు (HCU) సమీపంలో ఉన్న కంచ గచ్చిబౌలి భూముల (Kancha gachibowli Lands) వ్యవహారం రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ భూముల వివాదాన్ని ఆయుధంగా చేసుకొని విపక్ష బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ముప్పెట దాడి చేస్తున్నాయి. హెచ్ సీయూ భూముల వివాదంలో సుప్రీంకోర్టు ఎంటర్ కావడంతో పాటు ఫేక్ వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతుండటంతో కాంగ్రెస్ అదిష్టానం ఈ వ్యవహారంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఏఐసీసీ (AICC) వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) స్వయంగా రంగంలోకి దిగారు.

మంత్రులతో విస్తృత చర్చ
కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వివాదానికి సంబంధించి AICC వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan).. హైదరాబాద్ సచివాలయంలో కీలక భేటి నిర్వహించారు. భట్టి విక్రమార్క ఛాంబర్ లో జరిగిన ఈ భేటికి ఉప ముఖ్యమంత్రి భట్టితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీడబ్ల్యూసీ ఆహ్వానితుడు వంశీ చంద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా హెచ్ సీయూ భూముల వివాదంపై లోతైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వివాదానికి గల కారణాలను నటరాజన్ కు మంత్రులు వివరించినట్లు సమాచారం. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సైతం వివరించినట్లు తెలుస్తోంది.

Also Read: CCTV cameras: నేరంజరిగితే తప్ప సీసీ కెమెరాలు పట్టించుకోరా.. ఎస్పీ విజయ్ కుమార్

ఏఐ టెక్నాలజీతో అసత్యాలు
మరోవైపు యూత్ కాంగ్రెస్ కార్యనిర్వహక సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud).. విపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. హెచ్ సీయూ భూముల వివాదంపై ప్రతిపక్షాలు అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐ టెక్నాలజీ ఉపయోగించుకొని ఫేక్ వీడియోలను సర్క్యూలేట్ చేస్తున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాల అవాస్తవాలను, అసత్యాలను తిప్పికొట్టాల్సిన అవసరం.. యూత్ కాంగ్రెస్ పై ఉందని టీపీసీసీ చీఫ్ అన్నారు. సోషల్ మీడియాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన ప్రతీ ఒక్కరికి సముచిత గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు.

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?