Anchor Pradeep: ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడ్డానంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ ప్రదీప్
Anchor Pradeep Image Source Twitter
Cinema, ఎంటర్‌టైన్‌మెంట్

Anchor Pradeep: ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడ్డానంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ ప్రదీప్

Anchor Pradeep: యాంకర్ ప్రదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందర్ని తన మాటలతో ఇట్టే పడేస్తాడు. అలాగే, అనేక టీవీ షోలతో అలరించాడు. అలా మెల్లి మెల్లిగా సినిమాల వైపు అడుగులు వేసి స్టార్ హీరో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ప్రదీప్ హీరోగా మారాడు. తన అదృష్టాన్ని ” 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ” అనే మూవీతో పరీక్షించుకున్నాడు. చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ ఇప్పుడు తన రెండో మూవీ ” అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ” తో రాబోతున్నాడు.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 11న విడుదల కానుంది. ప్రస్తుతం, చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉంది. మంగళ వారం ట్రైలర్ ను విడుదల చేశారు. రీసెంట్ గా ఇచ్చిన  ఇంటర్వ్యూలో యాంకర్ ప్రదీప్ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపాడు.

Also Read: Mars Transit 2025: కర్కాటక రాశిలో అంగారక గ్రహ సంచారం.. ఆ రాశుల వారికి భయంకరమైన కష్టాలు?

ప్రదీప్ మాట్లాడుతూ ” అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకి  రెమ్యునరేషన్ తీసుకోకుండానే చేశాను. ఈ చిత్రానికి నా చిన్నప్పటి స్నేహితులు ప్రొడ్యూసర్స్ గా మారారు. దీనిలో నేను కూడా కొంత ఇన్వెస్ట్ చేశాను. అందుకే పారితోషికం తీసుకోలేదు. మూవీ విడుదలయ్యాక ప్రాఫిట్స్ వస్తే వాటిలో ఎంతో కొంత తీసుకుంటాను. గత రెండేళ్ళ నుంచి షోలు కూడా ఎక్కువగా చెయ్యలేదు. డబ్బు పరంగా కొన్ని సమస్యలు వచ్చాయి కానీ, ఎవరికి చెప్పలేదు నేనే మేనేజ్ చేసుకున్నాను ” అని తెలిపాడు.

Also Read:  RK Roja on Pawan Kalyan: శ్రీవారిని నిద్రపోనివ్వరా.. ఇదే మీ సనాతనమా.. పవన్ కు రోజా చురకలు

కామెంట్స్ పై రియాక్ట్ అయిన నెటిజన్స్ కోట్లు సంపాదించిన మీరు డబ్బు వలన ఇబ్బంది పడ్డారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి, ఈ మూవీ రిజల్ట్ తర్వాత ప్రదీప్ హీరోగా సినిమాలు చేస్తాడా లేక టీవీ షోలు చేస్తాడనేది తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే.

Just In

01

Special Trains: ప్రయాణికులకు బిగ్ న్యూస్.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు ఇక బుకింగ్..!

Vichitra Movie: తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌‌తో విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’..

Chain Snatching: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కోనాపూర్ శివారులో చైన్ స్నాచింగ్ కలకలం

Nepal: ప్రయాణికులకు శుభవార్త.. ఆర్‌బీఐ నిబంధనల మార్పుతో రూ.100కు పైబడిన భారత కరెన్సీ నోట్లు నేపాల్‌లో అనుమతి

Priyanka Gandhi: ఉపాధి హామీ పథకం పేరు మార్పు పై ప్రియాంక గాంధీ ఫైర్!