Mars Transit 2025: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాలు రాశి సంచారాలు చేస్తుంటాయి. 2025 ఏప్రిల్ 3 న కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే, కుజుడు 2025 జూన్ 7 వరకు అదే రాశిలో ఉండనున్నాడు. దీని ప్రభావం మొత్తం 12 రాశుల వారి పైన పడనుంది. కొన్ని రాశుల వారికి సానుకూలంగా ఉంటుంది. మరి కొన్ని రాశుల వారికి ప్రతి కూలంగా ఉంటుంది. కుజుడు స్థానం మార్చుకోవడం వలన రెండు రాశుల వారు భయంకరమైన కష్టాలు చూస్తారు. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
కర్కాటక రాశి ( Karkataka Rasi )
ఈ సంచారము ప్రభావం కర్కాటక రాశి ( Karkataka Rasi ) వారిపై ప్రతికూలంగా ఉంటుంది. వారు చేయాలనుకున్న పనులు మధ్య లోనే ఆగిపోతాయి. ఇంట్లో సమస్యలు ఎక్కువవుతాయి. మానసిక ప్రశాంతతను కోల్పోయి ప్రతి చిన్న దానికి పిల్లల మీద అరుస్తుంటారు. ఆర్ధిక సమస్యల వలన సతమతమవుతారు. ఈ సమయంలో వ్యాపారాలు కూడా దెబ్బతింటాయి. పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉండటం వలన మీరు ఏ పనిని సక్రమంగా చేయలేరు. కాబట్టి, తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని జ్యోతిష్యులు చెబుతున్నారు.
పరిహారం : ప్రతి మంగళ వారం హనుమాన్ టెంపుల్ కి వెళ్ళండి. అలాగే ఆంజనేయస్వామి వారి పేదలకు అన్నదానం చేయండి. ఇలా చేయడం వలన కొంత మేరకు కలిసి వస్తుంది.
మీన రాశి ( Meena Rasi )
ఈ సంచారము వలన మీన రాశి వారికి ప్రతికూల ఫలితాలను వస్తాయి. కొత్త పనులను మొదలు పెట్టకపోవడమే మంచిది. ఈ సమయంలో నమ్మకమైన వ్యక్తులు మీకు ద్రోహం చేయవచ్చు. అలాగే, మీరు ఒంటరిగా ఎక్కువగా గడుపుతారు. మీ మనసులోకి వచ్చే ప్రతికూల ఆలోచనల వల్ల మీరు బలహీనమవుతారు. ఈ సంచార సమయంలో మీరు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు మీ ఆరోగ్యం గురించి తగిన శ్రద్ధ తీసుకోవాలి. మీరు అనవసరమైన వాదనలకు వెళ్ళకండి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరదు.
పరిహారం : ప్రతిరోజూ గణేశునికి హారతి ఇచ్చి, దుర్గాదేవి మంత్రాలను జపించండి.