హుజూర్ నగర్ స్వేచ్ఛ: CM Revanth Reddy: హుజూర్ నగర్ పట్టణంలో సన్న బియ్యం పథకం ప్రారంభానికి వెళ్లిన ముఖ్యమంత్రి రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కలిసి హుజుర్ నగర్ లోని సీతారామస్వామి గుట్ట వద్ద ఇందిరమ్మ ఇండ్ల ను సందర్శించి నిర్మాణాలను పరిశీలించారు.రాష్ట్ర హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి.గౌతమ్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల తీరును ముఖ్యమంత్రి కి సమగ్రంగా వివరించారు. 135 బ్లాక్ లలో 2,160 ఇందిరమ్మ ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పధకం లో భాగంగా ఈ ప్రాంతంలో నిర్మిస్తున్న ఇండ్లు ప్రత్యేకత సంతరించుకున్నాయి. ఒకే చోట పార్క్, కమ్యూనిటీ హల్, మార్కెట్ వంటి సౌకర్యాలు చేపట్టి అన్ని హంగులతో ఈ ఇళ్లను నిర్మిస్తున్నారు.
Also Read: CM Revanth Reddy: పేదలకు సీఎం రేవంత్ అదిరిపోయే ఉగాది కానుక.. సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం
రాష్ట్రం లొనే ఇంత భారీగా ఇందిరమ్మ సింగల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించడం ఇదే మొదటిసారి పట్టణానికి అతి సమీపంలో ఉండడం, ప్రజలకు అవసరాల కు ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా ఏర్పాట్లు చేయటంతో నిలువ నీడలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారులకు వరంగా నిలవనున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉత్తమ్ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయాల్లో ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టారు.
Also Read: Gold Rate Today : గోల్డ్ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని చెత్త కుప్పలా మార్చారు. తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన కొద్ది రోజులకే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుమారు రూ.60 కోట్ల నిధులు రాబట్టి పనులు పూర్తి చేయిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఈ ఇల్లు పూర్తి అయి పెద్ద ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు