CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం.. ఉగాది సందర్భంగా అట్టహాసంగా ప్రారంభమైంది. హుజురాబాద్ లో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. దొడ్డుబియ్యం పంపిణీలో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్న రేవంత్.. పేదలకు కడుపునిండా మంచి భోజనం పెట్టే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చిన్నట్లు స్పష్టం చేశారు. ఈ పథకం కింద రేషన్ లబ్దిదారులకు ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పన సన్న బియ్యం లభించనుంది.
ఉగాది సందర్భంగా సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని హుజురాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నల్లగొండకు మంచి చరిత్ర ఉందన్న సీఎం.. ఇక్కడి నుంచి ఎంతో మంది ఎంపీలు గెలిచారని గుర్తుచేశారు. నల్లగొండ గడ్డ.. వీరుల గడ్డ అంటూ ప్రశంసించారు. మరోవైపు హైదరాబాద్ కు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు రేవంత్ స్పష్టం చేశారు.
Also Read: Vishwavasu Nama Ugadi 2025: విశ్వావసు నామ ఏడాదిలో.. ఈ తేదీలు తప్పక గుర్తు పెట్టుకోండి..
గతంలో పేదవాడు పండుగ పూట మాత్రమే తెల్లన్నం తినేవారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. సీఎంగా కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఉన్న సమయంలో తొలిసారి రూ.1.90 కే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేశారు. తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్టీ రామారావు దానిని రూ. 2 కు కిలో బియ్యం పథకం కింద మార్చారని పేర్కొన్నారు.