Swami Nithyananda Death: వివాదస్పద ఆధ్యాత్మిక గురువుగా స్వామి నిత్యానంద (Swami Nithyananda)కు పేరుంది. తమిళనాడు (Tamilnadu)కు చెందిన ఆయన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస్ (United States Of Kailash) పేరుతో సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకొని యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఐక్యరాజ్యసమితి (UNO) సమావేశాలకు సైతం ఆయన ప్రతినిధులు హాజరై ప్రసంగించడం అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే నిత్యానందకు సంబంధించి ఓ షాకింగ్ వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. ఆయన చనిపోయినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
నిత్యానంద మృతి?
వివాద్పద గురువు నిత్యానంద చనిపోయినట్లు ఆయన మేనల్లుడు స్వయంగా ప్రకటించారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు నిత్యానంద ప్రాణ త్యాగం చేశారని మేనల్లుడు సుందరేశ్వర్ (Sundreswar) వెల్లడించారు. అయితే ఈ వార్తల్లో నిజం లేదని పలువురు కొట్టిపారేస్తున్నారు. ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేసేందుకే ఇలా అబద్దాలను ప్రచారం చేస్తున్నారని కొందరు మండిపడుతున్నారు.
పోలీసుల విచారణ
ప్రస్తుతం నిత్యానంద మృతిపై జరుగుతున్న ప్రచారం తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండంతో పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రచారంలోని నిజానిజాలను వారు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Also Read: HCU Land Dispute: కేసీఆర్ బినామీలకు హెచ్ సీయూ భూములు.. లెక్కలు తీస్తే బొక్కలు విరుగుతాయి.. టీపీసీసీ చీఫ్
దేశంలో 40 ఆశ్రమాలు
ఒకప్పుడు స్వామిజీగా ఓ వెలుగు వెలిగిన నిత్యానందం ప్రస్తుతం పరారీలో ఉన్నారు. సెక్స్ స్కాండల్ కేసులోని ఇరుక్కొని ఆయన దేశం విడిచి పారిపోయారు. ఈ క్రమంలో కైలాస అనే ప్రత్యేక దేశాన్ని సృష్టించి తనకు తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. కాగా నిత్యానందకు దేశవ్యాప్తంగా 40 వరకూ ఆశ్రమాలు ఉన్నట్లు తెలుస్తోంది.