స్వేచ్ఛ, సినిమా: Kannappa Postponed: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఏప్రిల్ 25న ఈ మూవీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ, వీఎఫ్‌ఎక్స్ పనులు పెండింగ్ ఉండడంతో సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు విష్ణు ప్రకటించాడు. కన్నప్ప సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామని, హైయెస్ట్ స్టాండర్డ్స్‌తో చేయడానికి కట్టుబడి ఉన్నామని చెప్పాడు. “అందరికీ క్షమాపణలు చెబుతున్నాను.
మీరు కన్నప్ప సినిమా కోసం ఎంత ఎదురు చూస్తున్నారో నాకు తెలుసు. కానీ, ఈ సినిమాను మరింత అద్భుతంగా మీ ముందుకు తీసుకురావడానికి వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఎంతో అవసరం. అందుకే ప్రస్తుతానికి ఆ పని మీదే అందరం దృష్టి పెట్టాము. కచ్చితంగా మీరు ఆశ్చర్యపోయే విధంగా మీ ముందుకు వస్తాం. త్వరలోనే సినిమాకు సంబంధించి కొత్త రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటిస్తాం. ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని మన్నిస్తారని కోరుతున్నాను” అంటూ మంచు విష్ణు ప్రకటించాడు.
Also read: Mad Square : ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం మొదటి రోజు ఎన్ని కోట్లు చేసిందంటే..?