Mad Square : ” మ్యాడ్” (MAD) మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికి తెలిసిందే. ఆ చిత్రం క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్ని ఇన్ని కావు. ఆ మూవీకి ఉన్న ఫ్యాన్ బేస్ సీక్వెల్ కూడా అనౌన్స్ చేసేలా కారణమైంది. పాటల దగ్గర నుంచి డైలాగ్స్ వరకు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. పేరుకి తగ్గట్టే యూత్ కి మూవీ పిచ్చెక్కించింది. మరి, ఇంత క్రేజ్ సంపాదించుకున్న మూవీకి సీక్వెల్ లేకుండా ఉంటుందా ? కచ్చితంగా ఉంటుంది కదా ..అయితే, ఈ సారి కామెడీ డోస్ పెంచుతూ మ్యాడ్ స్క్వేర్ (Mad Square) అంటూ మన ముందుకొచ్చింది.
ఈ మూవీలో నార్నె నితిన్ ( Narne Nithin ) , రామ్ నితిన్ ( Ram nithin ) , సంగీత్ శోభన్ (Sangeeth Shobhan ) ముగ్గురు హీరోలు లీడ్ రోల్స్ లో నటించి మెప్పించారు. కళ్యాణ్ శంకర్ ( Kalyan Shankar) దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకం పై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ మూవీని నిర్మించారు.
Also Read: L2 Empuraan: “ఎల్ 2: ఎంపురాన్ ” రికార్డుల ఊచకోత.. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ మార్చి 28న ఆడియెన్స్ ముందుకొచ్చింది. సునీల్, సత్యం రాజేష్,ప్రియాంక జవాల్కర్, అనుదీప్, అనుదీప్, రెబా మోనికా జాన్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ మొదటి షో తోనే నుంచే మంచి రెస్పాన్స్ తెచ్చుకుని ముందుకు దూసుకెళ్తుంది.
ప్రస్తుతం, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. వరల్డ్ వైడ్ గా మొదటి రోజు ఈ మూవీ రూ.20.8 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది. ఇదే విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఎక్స్ వేదికగా ఓ పోస్టర్ ద్వారా వెల్లడించింది.
Also Read: Venkatesh Daggubati: వెంకటేష్ కు ఊహించని అనారోగ్య సమస్య.. బెడ్ రెస్ట్ తప్పదా?
సినిమాకి హిట్ టాక్ రావడం, కామెడీ టైమింగ్, నటీ నటుల నటన చిత్రానికి ప్లస్ అయిందనే చెప్పుకోవాలి. రెండు రోజులు సెలవులు కావడంతో మరిన్ని వసూళ్లను కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని సినీ వర్గాల వారు చెబుతున్నారు.