L2 Empuraan: 2019 లో మలయాళంలో ‘లూసిఫర్’ మూవీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత, తెలుగులో కూడా డబ్ చేశారు. ఇక్కడ కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది కానీ… బాక్సాఫీస్ వద్ద ఎక్కువ రోజులు నిలవలేకపోయింది. ఆ తర్వాత అదే స్టోరీని చిరంజీవి (Chiranjeevi) ‘గాడ్ ఫాదర్’ గా (Godfather) చేశారు. ఇది కూడా మంచి విజయాన్ని సాధించింది. అయితే, ‘లూసిఫర్’ సీక్వెల్ గా ‘ఎల్ 2 – ఎంపురాన్’ ను (L2: Empuraan) వచ్చింది.
ఈ మధ్య కాలంలో హిట్ అవుతుందన్న చిత్రాలు యావరేజ్ గా నిలుస్తున్నాయి. అసలు, హిట్ అవుతాయా అనుకున్న సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. కథ బాగుంటే.. సినిమాకి రెండు మూడు సార్లు వెళ్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), మోహన్ లాల్ ( Mohanlal ) కలిసి నటించిన చిత్రం “ఎల్ 2: ఎంపురాన్ “.
Also Read: Venkatesh Daggubati: వెంకటేష్ కు ఊహించని అనారోగ్య సమస్య.. బెడ్ రెస్ట్ తప్పదా?
మార్చి 27న ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకొచ్చింది. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వం వహించిన ఈమూవీని తెలుగులో దిల్ రాజు విడుదల చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ. 60 కోట్ల మార్కును దాటింది. చారిత్రాత్మక మైలురాయిని సాధించిన ఈ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ ప్రతిష్టాత్మకమైన రూ. 100 కోట్ల క్లబ్‌లోకి చేరిన పదవ మలయాళ చిత్రంగా నిలిచింది. కేవలం రెండు రోజుల్లోనే రికార్డు బ్రేక్ చేసి అత్యంత వేగంగా మార్క్ ను చేరిన మూవీగా నిలిచింది.
Also Read: Tirumala News: పెంకులతో యువకుడి ఆత్మహత్యాయత్నం.. తిరుమల పోలీసులు ఏం చేశారంటే?
ఈ నేపథ్యంలోనే మోహన్ లాల్ ” ఎల్ 2: ఎంపురాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 48 గంటల్లోపు రూ. 100 కోట్లను అధిగమించి సినీ చరిత్రలో కొత్త రికార్డు ను సృష్టించింది. ఈ విజయంలో నేను కూడా ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ , సపోర్ట్ వల్లనే ఇది సాధ్యమైంది ” అంటూ ఎక్స్ లో రాసుకొచ్చారు.
గతంలో 100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించిన మలయాళ చిత్రాలైన మంజుమ్మెల్ బాయ్స్, లూసిఫర్, ప్రేమలు, పులి మురుగన్, ఆడుజీవితం, ఎంపురాన్ తాజాగా, ఈ మూవీ కూడా లిస్టులో చేరిపోయింది.