Venkatesh Daggubati: విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati) , అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో ‘ఎఫ్ 2’ (F2 Movie) ‘ఎఫ్ 3’ (F3 Movie)వంటి చిత్రాలు ఎంత పెద్ద విజయం సాధించాయో ఇప్పుడు ఆ రెండింటికి మించి ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ” సంక్రాంతికి వస్తున్నాం ” తెరకెక్కింది. ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికి తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. రూ. 50 కోట్లు బడ్జెట్ పెడితే మొత్తం రూ. 300 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి సరి కొత్త రికార్డులను క్రియోట్ చేసింది. ఫ్యామిలీ , రీజనల్ చిత్రాలు ఈ కూడా ఈ రేంజ్ లో కలెక్షన్స్ సాధించడం పెద్ద కష్టమేం కాదని వెంకీమామ మూవీతో ప్రూవ్ అయింది.దిల్ రాజు (Dil Raju) బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రానికి భీమ్స్ (Bheems Ceciroleo) సంగీతాన్ని అందించారు. విడుదలకు ముందే ‘గోదారి గట్టు మీద’ అనే పాట బజ్ తీసుకొచ్చింది. జనవరి 14న విడుదలైన అయిన ఈ చిత్రానికి మొదటి షోతోనే మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో, ఇప్పుడు వెంకటేష్ ఎలాంటి సినిమాతో వస్తాడో అని అందరిలో ఆసక్తి నెలకొంది.
వెంకటేష్ ఇప్పటికే చాలా స్టోరీస్ విన్నప్పటికి, వాటిలో ఏది ఫైనల్ చేయలేదని తెలిసిన సమాచారం. తరుణ్ భాస్కర్ తో పాటు స్టార్ డైరెక్టర్ల పేర్లు వినిపిస్తున్నా ఎవ్వరికి ఒకే అని చెప్పలేదట. అయితే, ఇప్పుడు వెంకటేష్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Read: Madhavi Latha : నా అన్వేష్ నోరు జాగ్రత్త .. నీ వల్లే తల నొప్పి..?
అతను ఓ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడని తెలుస్తోంది. తాజా, టాలీవుడ్ సమాచారం ప్రకారం గత కొద్దీ రోజుల నుంచి వెంకటేష్ మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. వైద్యులు కొన్ని నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి మందులు ఇచ్చారట. దీంతో, ప్రస్తుతం వెంకీమామ ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు.
ఐపీఎల్ హైద్రాబాద్ టీం ఆడేటప్పుడు మాత్రం స్టేడియంకి వెళ్ళి ఎంకరేజ్ చేస్తుంటారు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచులకు వెంకీ కూడా వెళ్లి సందడీ చేశారు. సమ్మర్ అయిపోయే వరకు రెస్ట్ తీసుకొని జూన్ కి కొత్త సినిమా గురించి ఆలోచిస్తారని వెంకటేష్ సన్నిహితులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంకీమామ ఫ్యాన్స్, నెటిజన్స్ ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.