Madhavi latha : బెట్టింగ్ యాప్స్ ( Betting Apps ) వలన ఎంతో మంది జీవితాలు నాశనం అవ్వడమే కాకుండా .. ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు. దీని బారిన పడిన వారు ” ఆన్లైన్ గేమ్స్ ఆడకండి.. ఒక్కసారి వాటిలోకి వెళ్తే బయటకు రావడం చాలా కష్టం ” అంటూ పోస్టులు పెడుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదు. ఓ వైపు పోలీసులు రంగంలోకి దిగి ఇప్పటి వరకు ప్రమోట్ చేసిన వాళ్ళ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డబ్బులు ఉన్నోడు ఒకసారి పోతే ఏదొక రకంగా సంపాదించుకుంటాడు.. లేని వాళ్ళు ఇలాంటి ఆటలకు బానిసైతే వారికి చావే దిక్కు. ఈ యాప్స్ ఒక మాయ .. అవన్ని శకుని పాచికలు లాంటివి .. మీరు ఎన్ని సార్లు ఆడినా .. వారికనుగుణంగానే పడతాయి తప్ప .. మీకు కాదని తెలుసుకోవాలి. అయితే, తాజాగా నా అన్వేషణ అన్వేష్ ( Anvesh) పై మాధవి లత ( Madhavi latha ) ప్రశ్నల వర్షం కురిపించింది.
Also Read: David Warner: తొలి మూవీతోనే యమ క్రేజ్.. వార్నర్ కు తెలుగు ప్రేక్షకుల వింత రిక్వెస్ట్!
మాధవి లత ( Madhavi latha ) మాట్లాడుతూ ” ఏ వ్యక్తి అయితే బెట్టింగ్ తప్పు అన్నాడో.. మీరు కూడా విదేశాలకు వస్తే పాపలతో తిరగొచ్చు. మీరు కూడా ఇతర దేశాలకు వస్తే ఈ పిచ్ మీద రోజుకి ఇరవై సార్లు బ్యాటింగ్ చేయోచ్చు అని ఇలాంటివా నేర్పించేది? అసలు యూత్ కి ఈ విషయాల గురించా చెప్పేది? ఇది ఎందుకు కనెక్ట్ అవుతుందో కూడా చెబుతాను.. ఇప్పుడు, ఆ వీడియోలు చూసే ఫాలోవర్స్ నన్ను చాలా తిట్టుకుంటారు.. తిట్టినా కూడా పర్లేదు , నేను నిజాన్ని నిర్భయంగా చెబుతాను.
Also Read: Railway Jobs: రైల్వేలో 9 వేల ఉద్యోగాలు.. ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
ఎందుకంటే, ఆ వీడియోస్ చూసిన వాళ్ళు ఓహో ఫారెన్ కంట్రీకి వెళ్తే మనం కూడా వాళ్ళు పాపలతో తిరగొచ్చు అనే ఆలోచనలోకి వెళ్లిపోతారు. ఇలాంటి ఒక ఆలోచన ఉన్నప్పుడు వారికి అర్జెంటుగా డబ్బులు కావాలి. మన దగ్గర కూడా మనీ ఉంటే వెళ్ళిపోయి పాపలతో ఎంజాయ్ చేయోచ్చు. దాని కోసం మనకి ఈజీ మనీ కావాలి. ఎవరో ఒకరు ఇంకొక ఛానెల్ లోకి వెళ్తారు. బెట్టింగ్ యాప్స్ చూస్తాడు.. ఈజీ మనీ వస్తుంది మామ అనుకుంటాడు. మనం కూడా ఈజీ మనీ సంపాదించుకుంటే లక్సరీ లైఫ్ ని ఎంజాయ్ చేయోచ్చు. వేరే పాపలను కూడా వెంటేసుకుని తిరగొచ్చు.. అని ఇలాంటి వాటి గురించి చెబుతున్నావ్.. నువ్వు ఇతర దేశాల గురించి చెబుతూ.. మన దేశాన్ని అవమానిస్తున్నావ్? ” అంటూ ప్రశ్నించింది.