RC 16 Image Source (Twitter)
Cinema, ఎంటర్‌టైన్మెంట్

RC 16: మాస్ టైటిల్ తో వచ్చేసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

RC 16: గ్లోబల్ స్టార్ గురించి రామ్ చరణ్ ( Ram Charan )  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గేమ్ ఛేంజర్ ( Game Changer )  ఫ్లాప్ తర్వాత ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఇప్పటి వరకు RC 16 సంబంధించి ఒక్క అప్డేట్ కూడా లేదని మెగా ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. వారందరికి అదిరిపోయిన బర్త్ డే ట్రీట్ ఇచ్చేశాడు. రోజు చరణ్ పుట్టిన రోజు సందర్భంగా RC 16 టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. రామ్ చరణ్, బుచ్చిబాబు ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు ఉన్నాయి.

ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఒకసారి గమనిస్తే .. రగ్డ్ లుక్, గడ్డం, చెవులకు రింగులు పెట్టుకోవడం ఇలా అన్నీ కూడా కొత్తగా అనిపిస్తున్నాయి. మొన్నటి వరకు ఆఫ్ స్క్రీన్ లుక్‌ చూసి ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ కూడా ఫిదా అయ్యారు. ఇక, ఇప్పుడు చిత్రంలో ఉన్న రామ్ చరణ్ లుక్ ను రివీల్ చేశారు. పెద్ది ( Peddi )  అనే మాస్ టైటిల్‌ తో మన ముందుకొచ్చాడు. ఎన్నడూ లేని విధంగా రామ్ చరణ్ ను న్యూ లుక్ లో చూసి అందరూ షాక్ అవుతున్నారు.

రామ్ చరణ్ మాస్ అవతారంలో ఎలా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బీడీ వెలిగించే స్టైల్, భయమే తెలియని కళ్ళు, ధైర్యం ఇవన్నీ కూడా అదిరిపోయాయి. బ్యాట్ ఎంత పొగరుగా పట్టుకున్నాడో చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇక, లుక్ లో రామ్ చరణ్ ముక్కు పోగు హైలెట్. ఇంత వరకు ఇలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు. మరి, ఇది వర్కవుట్ అవుతుందో ? లేదో చూడాల్సి ఉంది. టైటిల్‌తో పాటుగా ఒక పోస్టర్ వస్తుందని అనుకున్నారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా రెండు పోస్టర్లను రిలీజ్ చేసి పెద్ద ట్రీట్ ఇచ్చారు.

గేమ్ ఛేంజర్ ఫ్లాప్ ను మర్చిపోవడానికి రామ్ చరణ్ నుంచి ఓ చిత్రం తొందరగా రావాలని మెగా అభిమానులు చాలా కోరుకున్నారు. ఈ ఏడాదిలోనే బుచ్చిబాబు సినిమా మొత్తం కంప్లిట్ చేసి రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. వారు కోరుకున్న విధంగానే పెద్ది మూవీఏడాది చివర్లో మన ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

Also ReadDrinking of Water: లెమన్ వాటర్ మంచిదేనా.. కాదా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

రామ్ చరణ్ పుట్టిన రోజుకి గ్లింప్స్‌ని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, ఏఆర్ రెహమాన్‌కు అనారోగ్య సమస్యలు కారణంగా ఆర్ఆర్ పనులు పెండింగ్ లో పడ్డాయి. దీంతో గ్లింప్స్‌ను కాకుండా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ తో సరిపెట్టారు.

బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న సినిమాలో కన్నడ నుంచి శివన్న కూడా నటిస్తున్నారు. ఇక, చరణ్ కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తుంది. అలాగే, బాలీవుడ్ నుంచి దివ్యేందు శర్మను తీసుకొచ్చారు. జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిసిన సమాచారం. చిత్రంలో హీరోయిన్ ను కొంచం స్పెషల్ గా చూపిస్తే.. యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. పోస్టర్‌ను చూస్తుంటే రామ్ చరణ్ రంగస్థలంలో చేసిన పాత్ర కంటే ఇంకా మాస్ గా ఉండబోతుందని తెలుస్తోంది.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ