Drinking of Water: కరోనా తర్వాత నుంచి మన జీవనశైలిలో అనేక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా, ఫుడ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పోషకాహారాలు ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకుంటే కరోనా లాంటి మహమ్మారిలు ఎన్ని వచ్చినా తట్టుకుని నిలబడతారు. ఉదయం లేవగానే చాలా మంది యోగా, వ్యాయామాలు వంటివి చేస్తుంటారు. ఎందుకంటే, దీని వలన ఆరోగ్యంగా ఉంటారు. అలాగే, రోగ నిరోధక శక్తీ కూడా పెరుగుతుంది. మనలో కొందరికి ఉదయం నిద్రలేవగానే డాక్టర్స్ గ్లాసు నీళ్లు తాగాలని సూచిస్తుంటారు. రాత్రి పూట పడుకునే ముందు ఆహారం తీసుకోవడం వలన శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. అందు వలన ఉదయాన్నే మంచి నీళ్లు తాగాలని చెబుతుంటారు.
శరీరంలోని కొవ్వును కరిగించుకోవడానికి, బాడీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి చాలా మంది పరగడుపున లెమన్ వాటర్ తాగుతారు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని, దానిలో వన్ స్పూన్ తేనె, నిమ్మకాయ రసం కలిపి తాగుతారు. అయితే ఇది మంచిదేనా.. కాదా? అనేది మనలో చాలా మందికి తెలియదు. నిమ్మ నీరు వలన మన శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Degree Jobs: డిగ్రీ పాసయ్యారా.. బ్యాంక్ జాబ్ మీ కోసమే ..!
లెమన్ వాటర్ లో సిట్రిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది. ఇది నార్మల్ గా కడుపు నుంచి స్రవిస్తుంది. ఈ ఆమ్లం ఆహారాన్ని తొందరగా జీర్ణం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కడుపులో ఏం లేనప్పటికి, ఆమ్ల స్రావం ఆగదు. అందుకే ఎక్కువసేపు తినకుండా ఉంటే, హైడ్రోక్లోరిక్ ఆమ్లం లోపల పేరుకుపోతుంది.
ఇలాంటి సమయంలో లెమన్ వాటర్ తాగితే, సిట్రిక్ యాసిడ్ కూడా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత, కడుపులో ఆమ్లం పరిమాణం కూడా ఒక్కసారిగా పెరుగుతుంది. ఫలితంగా, అసిడిటీతో వచ్చే అవకాశం ఉంది. అందుకే ఖాళీ కడుపుతో లెమన్ వాటర్ తాగేవాళ్ళు ఒకసారి ఆలోచించండి. గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధ పడేవాళ్ళు తాగకపోవడమే మంచిది. తాగాక పుల్లని త్రేనుపు, కడుపులో మంట వచ్చే అవకాశం ఉంది.
Also Read: RC 16 Update: రామ్ చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘ RC16’ నుంచి ఫస్ట్‌లుక్ అప్డేట్
అలాగే, తిన్న వెంటనే నిమ్మరసం అస్సలు తాగకూడదు. భోజనం చేసిన వెంటనే నిమ్మకాయ జ్యూస్ త్రాగడం వలన జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. కాబట్టి, పరగడుపున ఖాళీ కడుపుతో మంచి నీళ్ళు మాత్రమే తాగండి. ఇలా చేయడం వలన పొట్టలో ఉన్న ఆమ్లం ఈ నీటితో కలిసిపోతుంది. అప్పుడు, ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. భోజనం చేసే 20 నిమిషాల ముందు లేదా తిన్న తర్వాత లెమన్ వాటర్ తాగితే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆహార విషయాల్లో మీకు ఎటువంటి సందేహం ఉన్నా.. మీకు దగ్గర్లో ఉన్న వైద్యున్ని సంప్రదించి, ఆయన సూచనల మేరకు ఫుడ్ డైట్ ఫాలో అవ్వండి.