RC 16 Update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్స్ & ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ మూవీతో చరణ్ పాన్ ఇండియా స్టార్ గా మంచి పేరు పొందాడు. తండ్రికి తగ్గ తనయుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని పాన్ ఇండియా మూవీస్ తీసే లెవెల్ కు ఎదిగాడు. వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు అని అనుకుంటుంటే .. ” గేమ్ ఛేంజర్ ” తో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అనుకున్నది ఒకటి .. అయినది ఒకటి అన్నట్టు అయింది. ఇంకేముంది సినిమా హిట్ అవుతుంది .. ఇక రామ్ చరణ్ కు తిరుగులేదని అందరూ అనుకున్నారు. కట్ చేస్తే చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. సగానికి పైగా కూడా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. చరణ్ సినీ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది.
” గేమ్ ఛేంజర్ ” వంటి భారీ డిజాస్టార్ తర్వాత రామ్ చరణ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ ఆర్‌సీ16 ( RC16 ) . ఈ చిత్రానికి ‘ఉప్పెన’ఫేం బుచ్చిబాబు సానా ( Buchi Babu Sana) దర్శకత్వం వహిస్తున్నారు.. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ నటుడు ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్‌లో నటించిన దివ్యేందు శర్మ ఇందులో విలన్ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం, ఈ ప్రాజెక్ట్ షూటింగ్ దశలో ఉంది. అయితే, ఇప్పటి వరకు పేలిపోయే అప్డేట్లు ఏమి బయటకు రాలేదు. ఆ విషయం డైరెక్టర్ ను మెచ్చుకోవాలి. చిన్న క్లూ కూడా దొరకకుండా సినిమాకి డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు, ఈ నేపథ్యంలోనే మూవీ నుంచి బిగ్ అప్డేట్ రాబోతున్నట్లు తెలుస్తుంది.
Also Read: Degree Jobs: డిగ్రీ పాసయ్యారా.. బ్యాంక్ జాబ్ మీ కోసమే ..!
రామ్ చరణ్ పుట్టిన రోజు మార్చి 27. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ కి కొత్త ట్రీట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ ఫస్ట్‌లుక్‌ను ఆర్‌సీ16 నుంచి మూవీ టీం రిలీజ్ చేయనుంది. ఈ విషయాన్ని మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సానా అధికారికంగా వెల్లడించారు. రేపు ఉదయం 9.09 గంటలకు ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. దీనిపై రియాక్ట్ అయినా మెగా ఫ్యాన్స్, ప్రేక్షకులు ఈ రోజు కోసమే కొన్ని నెలల నుంచి వెయిట్ చేస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. మైత్రీమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా.. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరి, ఈ సినిమా అయిన హిట్ అయ్యి రామ్ చరణ్ మార్కెట్ ను పెంచుతుందో? లేదో తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే.