Panic Button In MMTS (Image Source: AI)
హైదరాబాద్

Panic Button In MMTS: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఒక్క బటన్ నొక్కితే చాలు..

Panic Button In MMTS: హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలు (MMTS Rail)లో మహిళపై జరిగిన అత్యాచారయత్నం ఘటన ప్రతీ ఒక్కరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఎప్పుడు రద్దీగా ఉండే రైలులో మహిళకు రక్షణ లేదా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నిత్యం వేలాది మంది ప్రయాణించే లోకల్ ట్రైన్స్  (Hyderabad Local Trains)లో మహిళల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకోవాలన్న చర్చ సమాజంలో మెుదలైంది. ఇది గమనించిన దక్షిణ మధ్య రైల్వే శాఖ (South Central Railway) కీలక నిర్ణయం తీసుకుంది. రైలులో మహిళలకు పూర్తి రక్షణ కల్పించేలా చర్యలకు ఉపక్రమించింది.

భద్రత మరింత బలోపేతం
మహిళల భద్రత కోసం ఎంఎంటీఎస్ రైళ్లలో పానిక్ బటన్స్ (Panic Buttons) ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. హైదరాబాద్ లోకల్ ట్రైన్స్ లో మహిళల రక్షణకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ మెుదలైన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ (Arun Kumar Jain) రంగంలోకి దిగారు. మహిళల భద్రతకు తీసుకుంటున్న చర్యలపై ఆయన ఆరా తీశారు. ఈ నేపథ్యంలో MMTS రైళ్లలో ‘పానిక్ బటన్స్’ తీసుకురావాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. అలాగే బోగీల్లో సీసీ కెమెరాలు, ఆర్పీఎఫ్ పోలీసుల భద్రతను పెంపొందించాలని తీర్మానించారు.

Read Also: CM Revanth on Betting Apps: బెట్టింగ్ యాప్స్ ఆగడాలపై సీఎం రేవంత్ కన్నెర్ర.. అసెంబ్లీలో కీలక ప్రకటన

గతంలోనే ప్రతిపాదన
రైళ్లల్లో ప్రయాణించే స్త్రీల భద్రత కోసం గతంలోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో పానిక్ బటన్స్ అంశాన్ని కేంద్ర రైల్వేశాఖ ప్రతిపాదించింది. ప్రయోగాత్మకంగా దేశంలోని 117 రైళ్లలో ఈ పానిక్ బటన్స్ ఏర్పాటు చేయాలని అప్పట్లో రైల్వే అధికారులను కేంద్రం ఆదేశించింది. అయితే అవి సత్ఫలితాలు ఇస్తున్నాయా? లేదా? అన్న దానిపై కేంద్రం ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వలేదు.

Read Also This: Mahabubabad Crime: మరీ ఇంత దారుణమా.. ప్రియుడి కోసం బిడ్డనే.. తల్లి చేసిన ఘోరం!

పానిక్ బటన్స్ పనితీరు
ఇక పానిక్ బటన్స్ పనితీరు విషయానికి వస్తే.. మహిళల భద్రతకు అవి అలారంలా పనిచేస్తాయి. వీటిని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ప్రమాదంలో ఉన్న మహిళ ఈ పానిక్ బటన్ ను ప్రెస్ చేస్తే వెంటనే కంట్రోల్ రూమ్ కు అలెర్ట్ మెసేజ్ వెళ్లిపోతుంది. దీంతో ఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే అప్రమత్తం అవుతారు. ప్రమాదంలో ఉన్న మహిళ వద్దకు హుటాహుటీనా చేరుకొని అమెకు రక్షణగా నిలబడతారు.

ఇవి కూడా చదవండి

Dogs Cry at Night: కుక్కలు రాత్రిపూట ఎందుకు ఏడుస్తాయి.. ఇది శుభమా.. ? అశుభమా?

Case on Bandi Sanjay: బండి సంజయ్ కు ఊహించని ఝలక్.. పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు!

Just In

01

Drug Factory Busted:చర్లపల్లిలో డ్రగ్ తయారీ ఫ్యాక్టరీపై దాడి.. వేల కోట్ల రూపాయల మాదకద్రవ్యాలు సీజ్

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు