Jr NTR Pranathi (imgae source : instagram)
Cinema

Jr NTR Pranathi: భార్యకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్ .. వైరల్ అవుతున్న ఫోటోలు

Jr NTR Pranathi: జూనియర్ ఎన్టీఆర్ ( NTR )  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి ( Rajamouli)  దర్శకత్వం వహించినఆర్ఆర్ఆర్ ” ( RRR ) మూవీతో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నాడు. తర్వాతదేవర” ( Devara )  మూవీతో డీసెంట్ హిట్ అందుకున్నాడు. టాలీవుడ్ లో తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న స్టార్ హీరోలలో ఎన్టీఆర్ కూడా ఒకరు. సినిమా సినిమాకి తన స్టైల్ ని మారుస్తూ అభిమానులు మెచ్చే మూవీస్ ను చేస్తుంటాడు. తెలుగు సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్న యంగ్ టైగర్ త్వరలో బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

స్టార్ హీరో హృతిక్ రోషన్ తోవార్ 2 ” మూవీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి బర్త్ డే ను జపాన్ లో సెలెబ్రేట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం, జూ.ఎన్టీఆర్ జపాన్ లో గ్యాప్ లేకుండా ‘దేవర’ ప్రమోషన్స్ చేస్తూ బిజీ అయ్యారు. ఓ వైపు మూవీ ప్రమోషన్స్ చేస్తూనే.. ఇంకో వైపు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు. రోజు భార్య లక్ష్మీ ప్రణతి బర్త్ డే ను జపాన్ లో గ్రాండుగా సెలెబ్రేట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఎన్టీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి కాస్తా వైరల్ గా మారాయి. భార్య ఫోటోకి ‘అమ్మలు హ్యాపీ బర్త్ డే’ అనే క్యాప్షన్ జోడించి బ్యూటిఫుల్ గా విషెష్ తెలిపాడు. ఈ ఫొటోలు షేర్ చేసిన కొద్దీ నిముషాల్లోనే వైరల్ గా మారాయి. తారక్, ప్రణతి జోడీపై నందమూరి అభిమానులతో పాటు నెటిజెన్స్ సైతం లైక్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందమైన జంటకి అభయ్, భార్గవ్ రామ్ ఇద్దరు కుమారులు ఉన్నారు.

Also Read: Swiggy Instamart: స్విగ్గీ వినూత్న నిర్ణయం.. మెుబైల్ ప్రియులకు ఇక పండగే!

ఇదిలా ఉండగా.. జపాన్ లో మరో రెండు రోజుల్లో ‘దేవర’ చిత్రం రిలీజ్ కానుంది. ఇప్పటికే అక్కడ ప్రివ్యూ షోలను ప్రదర్శించగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ‘RRR’ విజయం తర్వాత జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బేస్ విపరీతంగా పెరిగిపోయింది. ఇంత బిజీగా ఉంటూ కూడా అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వస్తున్న ‘వార్ 2’ షూటింగ్ లోనూ తారక్ పాల్గొంటున్నారు. YRF యూనివర్స్ లో తెరకెక్కుతున్నచిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారు. షూటింగ్ చాలా వరకు కంప్లిట్ అయింది. రీసెంట్ గా హృతిక్ రోషన్ కు గాయాలపాలవ్వడంతో కొద్దీ రోజులు బ్రేక్ ఇచ్చారు. మళ్ళీ, ఇప్పుడు కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. దీనితో పాటు ప్రశాంత్ నీల్ కాంబోలో # ‘NTRNeel’ అనే కొత్త చిత్రం చేస్తున్నారు. ఇప్పటికే, సినిమా షూటింగ్ మొదలవ్వగా.. భారీ యాక్షన్ సీక్వెన్స్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?