Betting Gang Arrest: ప్రస్తుతం బెట్టింగ్ మాట చెబితేనే భయం పుడుతోంది. కొద్దిరోజులుగా బెట్టింగ్ యాప్స్, ఆన్ లైన్ గేమింగ్ యాప్స్ మీద తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. పలువురు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదవడంతో పాటు యాంకర్ శ్యామల, విష్ణుప్రియ, రీతూ చౌదరి వంటి వాళ్లు విచారణకు కూడా హాజరవుతున్నారు. అదే సమయంలో ఆయా చోట్ల బెట్టింగ్ నిర్వాహకులపై దాడులు జరుగతున్నాయి. భారీగా సొమ్ము బయటపడుతోంది. దానికి ఐపీఎల్ కూడా మొదలవడంతో పోలీసులు మరింత ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో మరో గ్యాంగ్ కూడా పోలీసుల చేతికి చిక్కింది.
Hyderabad Crime: ఉద్యోగమన్నాడు.. బంగ్లాదేశ్ యువతిని తెచ్చాడు.. ఆ తర్వాత?
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లు నడుస్తున్న నేపథ్యంలో బెట్టింగులు నిర్వహిస్తున్న ఇద్దరిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 1.36 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రామ్ దేవ్ అశోక్ నగర్ నివాసి. నారాయణగూడ నివాసి పవన్ అగర్వాల్ అతని స్నేహితుడు. ఐపఎల్ టోర్నమెంట్ నడుస్తున్న క్రమంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహించాలని ఇద్దరు కలిసి పథకం వేశారు. దాని ప్రకారం డబ్బు ఇచ్చి అశోక్ నగర్ కు చెందిన శ్రీరాజ్ బూబ్ అనే బుకీ నుంచి ఆన్ లైన్ బెట్టింగ్ యూజర్ ఐడిలు తీసుకున్నారు. అనంతరం బెట్టింగులు ఆడేవారికి వెబ్ లింక్ లాగిన్ ఐడిలు, పాస్ వర్డ్ లు తెలిపారు. ఈ ఇద్దరు అబిడ్స్ లోని బాంబే బార్ వద్ద ఉండగా సమాచారం అందుకున్న సీఐ రాఘవేంద్ర ఎస్సైలు నర్సింలు, మహేష్, నవీన్ తోపాటు సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు 15 లక్షల రూపాయకు పైగా బెట్టింగులు స్వీకరించినట్టు వెళ్లడయ్యింది. ఇద్దరిపై కేసులు నమోదు చేసి అబిడ్స్ పోలీసులకు అప్పగించారు.