Hyderabad Crime(imagecredit:twitter)
క్రైమ్

Hyderabad Crime: ఉద్యోగమన్నాడు.. బంగ్లాదేశ్ యువతిని తెచ్చాడు.. ఆ తర్వాత?

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Hyderabad Crime: ఉద్యోగం పేర బంగ్లాదేశ్ యువతిని మన దేశానికి తీసుకొచ్చి ఆమెతో బలవంతంగా వ్యభిచార కార్యకలాపాలు జరిపిస్తున్న ఇద్దరిని వ్యక్తులను సెంట్రల్ జోన్ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి చెరలో ఉన్న యువతిని మహిళా సంరక్షణ కేంద్రానికి తరలించారు. టాస్క్​ ఫోర్స్​ డీసీపీ సుధీంద్ర తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. లక్డీకాపూల్​ లోని ది సెంట్​ హోటల్​ లో వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నట్టుగా సమాచారం అందటంతో టాస్క్​ ఫోర్స్​ పోలీసులు దాడి చేశారు.

ఓ గదిలో యువతితోపాటు ఉన్న ఘాన్సీబజార్​ నివాసి సమీర్​ మైటీని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని విచారించగా రెండేళ్ల క్రితం ఓ ఏజెంట్​ఆమెను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వెస్ట్​ బెంగాల్ కు తీసుకువచ్చినట్టు వెల్లడైంది. ఆ తరువాత ఆమె పేర ఆధార్​ కార్డు, ఇతర గుర్తింపు పత్రాలను తయారు చేయించినట్టుగా తెలిసింది. అనంతరం ఢిల్లీ తీసుకెళ్లి బలవంతంగా వ్కభిచార కార్యకలాపాలు జరిపించినట్టుగా తెలిసింది.

Also Read: Sangareddy District Crime: దారుణం.. భర్త ముందే భార్యపై అత్యాచారం

ఆ తరువాత వేర్వేరు ఏజెంట్లు తనను వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళుతూ ఇదే పని చేయిస్తూ వచ్చినట్టు బాధితురాలు పేర్కొంది. కొన్ని రోజులుగా వెస్ట్​ బెంగాల్​కు చెంది చార్మినార్​ ప్రాంతంలో ఉంటున్నకార్తిక్​దాస్​(29) తనతో వ్యభిచారం చేయిస్తున్నట్టు తెలియచేసింది. అతను ఏ హోటల్ కు వెళ్లమంటే తాను ఆ హోటల్ కు వెళుతూ వచ్చినట్టు చెప్పింది. ఈ క్రమంలో పోలీసులు కార్తిక్ దాస్​ను కూడా అరెస్ట్ చేశారు. విచారణలో కార్తిక్​ దాస్ ఎప్పుడూ విటులను నేరుగా కలవలేదని వెల్లడైంది.

వాట్సాప్ ద్వారా ఫోటోలు పంపించి ఎవరైనా అమ్మాయి కావాలంటే ఆన్​లైన్​లో డబ్బు ట్రాన్స్​ఫర్​చేయించుకుని ఫలానా హోటల్ ఫలానా నెంబర్​రూంకు వెళ్లండి అని మెసెజీలు పెట్టేవాడని తేలింది. కార్తిక్​దాస్ తోపాటు సమీర్​పై కేసులు నమోదు చేసిన టాస్క్​ఫోర్స్ పోలీసులు తదుపరి దర్యాప్తు నిమిత్తం ఇద్దరిని లక్డీకాపూల్ పోలీసులకు అప్పగించారు.

Also Read: Betting Apps Promotion Case: విచారణకు డుమ్మా కొట్టిన విష్ణుప్రియ.. రీతూ చౌదరి.. కారణం అదేనా?

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు