Online Gaming Gang Arrested: బెట్టింగ్ యాప్స్(Betting Apps) లపై సర్కార్ కన్నెర్రజేసిన వేళ.. మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓ వైపు యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న ఇన్ ఫ్లూయెన్సర్ల(Social Media Influencers)కే పోలీసులు(Telangana Police) చుక్కలు చూపెడుతుంటే మరోవైపు అదురు బెదురు లేకుండా బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ గ్యాంగ్(Gang) పోలీసుల చేతికి చిక్కింది. ఆన్ లైన్ గేమింగ్(Online Gaming App) తోపాటు సట్టా బెట్టింగ్(Satta betting) ను నిర్వహిస్తున్న ముఠాను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్(Central Zone Task Force) అధికారులు మధురానగర్(Madhranagar) పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు.
నిందితుల నుంచి ఆన్ లైన్ గేమింగ్ వెబ్ సైట్లను తయారు చేయటానికి ఉపయోగించిన 3 మ్యాక్ బుక్కులు, ఒక ట్యాబ్, 2 కలర్ ప్రింటర్లు, సట్టాకు సంబంధించిన 50 కరపత్రాలు, 3 బెట్టింగ్ చార్టులను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు 1.55లక్షల నగదును సీజ్ చేశారు. ఇక, బ్యాంక్ ఖాతాల్లో ఉన్న మరో 2.13 లక్షల రూపాయలను ఫ్రీజ్ చేశారు.
టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కుమ్రం భీం జిల్లా కాగజ్ నగర్ కు చెందిన శ్రీకాంత్, హరీష్, సతీష్ కుమార్, తిరుపతి, వినోద్ లు స్నేహితులు. ఇంటర్మీడియెట్ వరకే చదివిన ఆ అయిదుగురు కార్పెంటర్లుగా పని చేస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ అయిదుగురు ఆన్ లైన్ ద్వారా శ్రీదేవి, కళ్యాణ్, మిలన్ అన్న వెబ్ సైట్లలోకి వెళ్లి సట్టా ఆడటానికి అలవాటు పడ్డారు. ఈ క్రమంలో ఆన్ లైన్ బెట్టింగులు, సట్టా దందా ఎలా నిర్వహించవచ్చన్న దానిపై అయిదుగురికి అవగాహన వచ్చింది. దాంతో సొంతంగా ఆన్ లైన్ గేమింగ్ తోపాటు సట్టా బెట్టింగ్ నిర్వహించి డబ్బు సంపాదించుకోవాలని పథకం వేసుకున్నారు.
Anchor Shyamala: బెట్టింగ్ యాప్స్.. యాంకర్ శ్యామల పిటిషన్‌పై కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..
ఫ్లాట్ లో సెటప్..
దీంట్లో భాగంగా ఎల్లారెడ్డిగూడలోని దివ్య ఎన్ క్లేవ్ లో ఓ ఫ్లాట్ ను అద్దెకు తీసుకున్నారు. దీనికి నెలకు 25వేల రూపాయల కిరాయి చెల్లిస్తున్నారు. అక్కడే ఖరీదైన ల్యాప్ టాప్ లతో పాటు ఇతర పరికరాలను ఏర్పాటు చేసుకుని ఆన్ లైన్ గేమింగ్, సట్టా బెట్టింగును ప్రారంభించారు. దీని కోసం రూపొందించిన వెబ్ సైట్ల వివరాలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి అక్రమ కార్యకలాపాలు మొదలు పెట్టారు. తమ వెబ్ సైట్లో రిజిష్టర్ అయి పలువురు పెద్ద మొత్తాల్లో డబ్బు సంపాదించారంటూ నకిలీ వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయటం ద్వారా వందలాది మందిని ఉచ్ఛులోకి లాగి వారిని నిలువునా ముంచారు.
ముందుగా వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి అందుకు రూ. 1000 చార్జీ వసూలు చేస్తారు. అలా కొంతమందికి అలవాటు చేస్తారు. 3,4 సార్లు చిన్న మొత్తాల్లో వారికి లాభాలు వచ్చేలా చేసి బాధితులు నమ్మిస్తారు. పూర్తిగా నమ్మారని డిసైడ్ చేసుకున్న తర్వాత డబ్బులు కొల్లగొట్టడం మొదలుపెడతారు. పోలీసులకు దొరకకుండా ఉండటానికి కొంతమంది పేదల గుర్తింపు కార్డులను సేకరించి వారి పేర్ల మీద బ్యాంక్ అకౌంట్లు తెరిచి అక్రమ కార్యకలాపాలు సాగిస్తారు. ఇలా అక్రమాలు పాల్పడిన నిందితులు.. తమకు బ్యాంక్ ఖాతాలను సమకూర్చిన వారికి నెలకు ఇంత అని డబ్బు చెల్లిస్తూ వచ్చారు. కాగా, గ్యాంగ్ కొనసాగిస్తున్న ఈ కార్యకలాపాల గురించి పక్కాగా సమాచారాన్ని సేకరించిన సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు మధురానగర్ పోలీసులతో కలిసి దాడి జరిపి 5 గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిపై కేసులు నమోదు చేసి మధురానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: