Anchor Shyamala: ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విషయంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు యాంకర్ శ్యామలదే. ఆమె ఓ పార్టీకి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తుండటంతో.. ఇతర పార్టీల వాళ్లు ఆమెను భారీగా టార్గెట్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు తనపై కేసు నమోదు అవడంతో.. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే పార్టీ అధిష్టానం నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదు. కారణం, ఆమెను ఇంకా పోలీసులు విచారించలేదు. కేసు నిరూపితమై, అరెస్ట్ అయితే అప్పుడేమైనా పార్టీ ఆలోచిస్తుందేమో కానీ, ప్రస్తుతానికైతే ఆమెపై ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి పార్టీ సిద్ధంగా లేదు. ఎందుకంటే, ఆ పార్టీ తరపున కాస్తో, కూస్తో వినిపిస్తున్న నోరు ఆమెదే కావడం విశేషం.
Also Read- Naga Vamsi: 50వ సినిమా పవన్ కళ్యాణ్‌తో చేయను.. నాకు ఇష్టమైన ఎన్టీఆర్‌తో చేస్తా!
ఈ నేపథ్యంలో యాంకర్ శ్యామల కూడా ఓ అడుగు ముందుకు వేసి తనని అరెస్ట్ చేయకుండా ఉండేలా క్వాష్ పిటిషన్ వేస్తూ, తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. శ్యామల పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. విచారణ అనంతరం శ్యామలను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, అరెస్ట్ ఆగిపోయినప్పటికీ.. ఈ బెట్టింగ్ యాప్స్ విషయంలో పోలీసులకు సహకరించాలని శ్యామలకు కూడా కోర్టు ఆదేశాలిచ్చింది. సోమవారం పోలీసుల విచారణకు హాజరు కావాలని శ్యామలకు హైకోర్టు తెలిపింది. దీంతో కాస్త ఊపిరి పీల్చుకున్న శ్యామల, సోమవారం లోపు తన లాయర్‌తో కలిసి పోలీసుల విచారణకు హాజరు కానుందని తెలుస్తుంది.
తెలంగాణ హైకోర్టులో యాంకర్ శ్యామల పిటిషన్‌పై విచారణ
శ్యామలను అరెస్ట్ చేయవద్దని పోలీసులకు ఆదేశం
సోమవారం పోలీసుల విచారణకు హాజరుకావాలన్న శ్యామలకు కోర్టు ఆదేశం
విచారణకు సహకరించాలన్న న్యాయస్థానం https://t.co/YXlBVCMxNQ
— BIG TV Breaking News (@bigtvtelugu) March 21, 2025
మరోవైపు ఇప్పటికే ఈ కేసులో దాదాపు 26 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, నిధి అగర్వాల్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. విజయ్ దేవరకొండ, రానా.. ఇప్పటికే తమ పీఆర్ టీమ్ ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా, ప్రకాష్ రాజ్ మాత్రం సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేసి, అందులో వివరణ ఇచ్చారు. పోలీసులు కనుక తనని పిలిచి విచారిస్తే.. వారికి చెప్పాల్సింది చెబుతానని ఆ వీడియోలో ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. నిధి అగర్వాల్, మంచు లక్ష్మీ వంటి వారు మాత్రం ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు.
Also Read- Betting Apps: బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో.. రూ. 80 లక్షలు నష్టపోయిన బెట్టింగ్ బాధితుడు
ఇంకా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విషయంలో నోటీసులు అందుకున్న టేస్టీ తేజ, విష్ణు ప్రియ, రీతూ చౌదరి వంటి వారంతా పోలీసుల విచారణకు హాజరయ్యారు. పోలీసులు అడిగిన ప్రశ్నలు కొన్నింటికి సమాధానం చెప్పిగా, కొన్నింటికీ మాత్రం గుర్తు లేదు అన్నట్లుగా సమాధానమిచ్చారని తెలుస్తుంది. మరోవైపు విష్ణు ప్రియ ద్వారా తను ఈ బెట్టింగ్ యాప్స్ గురించి తెలుసుకున్నానని పోలీసుల విచారణలో రీతూ చౌదరి తెలిపినట్లుగా టాక్ నడుస్తుంది. ఇలా మొత్తంగా అయితే ఒక వారం నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారం వార్తలలో హైలెట్ అవుతూనే ఉంది. దీనిపై టీజీఆర్టీసీ ఎండి, ఐపీఎస్ అధికారి సజ్జనార్ మాత్రం ఈ బెట్టింగ్ యాప్స్‌పై పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు