Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాడ్స్ ప్రమోషన్ చేస్తున్నట్లు ఉన్న వీడియోను నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్లపై కేసులు పెట్టి కఠినంగా వ్యవహరిస్తున్న సమయంలో ఈ న్యూస్ ప్రాముఖ్యతను సంతరించకుంది. ఈ వీడియోను ఆర్టీసీ ఎండీ సజ్జనార్, పోలీసులకు ఎక్స్(Twitter)లో ట్యాగ్ చేస్తున్నారు. ‘బెట్టింగ్ అప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీస్ పై కేసులు పెడుతున్న పోలీసులు ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.’ అంటూ పోస్టులు పెడుతున్నారు.
సజ్జనార్ కు రిక్వెస్ట్
బెట్టింగ్ యాప్స్ వల్ల ఇటీవల పలువురు బాధితులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే కొంతమంది ప్రముఖులు వీటిని ప్రచారం చేస్తుండటంతో బాధితులు వీటికి వెంటనే ఆకర్షితులై యాప్ ల వల్ల తనువు చాలిస్తున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ బెట్టింగ్ యాప్ లపై కన్నెర్ర చేయడంతో పోలీసులు సైతం రంగంలోకి దిగారు. బెట్టింగ్ మాయలోపడి యువత జీవితాలను నాశనం చేసుకోకుండా వాటిపై అవగాహన కల్పిస్తూ సోషల్ మీడియా వేదికగా హెచ్చరిస్తున్నారు. ఇటీవల సజ్జనార్ ఎక్స్ (ట్విట్టర్)లో ‘బెట్టింగ్ యాప్ లతో ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేసి కోట్లలో సంపాదించి.. వేలల్లో పంచుతూ సంఘ సేవ చేస్తున్నట్లు పోజులు కొడుతున్న ఇలాంటి వాళ్లనా మీరు ఫాలో అవుతున్నది..? వీరి స్వార్థం వల్లే బెట్టింగ్ సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. భారత ఆర్ధిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తున్నది. అసలు ఏం ఉద్ధరించారు వీళ్ళు. ఏమైనా దేశ సేవ చేస్తున్నారా? సమజాహితం కోసం ఏమైనా మంచి పనులు చేస్తున్నారా!? ఇప్పటికైనా ఇలాంటి సైబర్ టెర్రరిస్టులను అన్ ఫాలో కొట్టండి. వారి అకౌంట్ లను రిపోర్ట్ చేయండి. ఎవరైనా బెట్టింగ్ యాప్ ల వల్ల నష్టపోతే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి’ ఈ క్రమంలోనే హైదరాబాద్ మెట్రో వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.
Also Read: Koluvula Pandaga: అందాల పోటీలు నిర్వహిస్తే.. కడుపుమంట ఏల.. సీఎం రేవంత్ రెడ్డి
సెలబ్రిటీలపై కేసులు
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై ఇవాళ(సోమవారం) పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్ (పరేషన్ బాయ్స్), హర్ష సాయి, రీతు చౌదరి, టేస్టీ తేజతో సహా 11 మంది నటులు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్‌లపై కేసు నమోదు చేశారు. అమాయకులను మోసం చేసి రూ. వందల కోట్లు కొల్లగొడుతున్న కేటుగాళ్లను పోలీసులు కటకటాల్లోకి నెడుతున్నారు. అతిపెద్ద మల్టీలెవల్ మోసానికి తెలియకుండానే ప్రచారం కల్పించిన సెలబ్రిటీలకు సైబరాబాద్ పోలీసులు గతంలో నోటీసులు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి
Ayyanna Patrudu on YCP: దొంగల వలె కాదు.. దొరల్లా రండి.. వైసీపీకి స్పీకర్ క్లాస్
Prakash Raj: పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి నాకు ఎటువంటి నోటీసు రాలేదు.. వస్తే చెబుతా!