Koluvula Pandaga
తెలంగాణ

Koluvula Pandaga: అందాల పోటీలు నిర్వహిస్తే.. కడుపుమంట ఏల.. సీఎం రేవంత్ రెడ్డి

Koluvula Pandaga:హైదరాబాద్ ర‌వీంద్రభార‌తిలో ‘కొలువుల పండగ’ పేరుతో నియామ‌క ప‌త్రాల అంద‌చేత కార్య‌క్ర‌మానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మంత్రి సీతక్క (Minister Seethakka) అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేదికపై 922 మందికి నియామక పత్రాలను సీఎం అందజేయనున్నారు. ఇందులో ఒక్క కారుణ్య మరణాల ద్వారానే 582 మందికి ఉద్యోగాలు లభించాయి. వారితో పాటు మిషన్ భగీరథ శాఖలో 55 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు, 27 మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖలో 38 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు, 55 మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ‘బిల్డ్ నౌ’ పోర్టల్ ను ఆవిష్కరించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

‘ఈ నియామకాలు మీ హక్కు’

గత ప్రభుత్వం కారుణ్య నియామకాలను నిర్లక్ష్యం చేసిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ ‘ఉద్యోగాలు మీ హక్కు’ అంటూ రేవంత్ మాట్లాడారు. కొలువుల కోసమే తెచ్చుకున్న తెలంగాణలో ఖాళీలను భర్తీ చేస్తారని అంతా భావించారని అన్నారు. తెలంగాణ కోసం యువత తమ జీవితాలను త్యాగం చేసిందన్న రేవంత్.. కొత్త రాష్ట్రం ఏర్పడితే తమ జీవితాలు బాగుపడతాయని అనుకున్నారని తెలిపారు. అయితే రాష్ట్రం ఏర్పడ్డా యువత ఆకాంక్షలు నెరవేరలేదని రేవంత్ అన్నారు. గత ప్రభుత్వం పదేళ్లు అయినా ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించలేదని గుర్తు చేశారు. దాని వల్ల యుక్త వయసులో ఉన్న పిల్లల జీవితాలు సర్వ నాశనమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.

‘మాలాగా ఎందుకు చేయలేదు’

గత ప్రభుత్వం ఎన్ని నియామకాలు చేపట్టిందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఎన్ని పరీక్షలను సజావుగా నిర్వహించిందో చెప్పాలని పట్టుబట్టారు. 10 నెలల్లో మేము చేసిన పనులను.. 10 ఏళ్లలో మీరు ఎందుకు చేయలేదని నిలదీశారు. దీనిని నిర్లక్ష్యమనాలా? బాధ్యతారాహిత్యమనాలా? అని ప్రశ్నించారు. మీ ఉద్యోగాలు మీరు ఆస్వాదించారు తప్ప.. యువత గురించి ఆలోచించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్ సవాల్..

ఉద్యోగ నియామకాలకు సంబంధించి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 10 నెలల్లో 59 వేల ఉద్యోగాలు ఇచ్చిన ముఖ్యమంత్రి గానీ, రాష్ట్రం గానీ ఉంటే చూపించాలని సీఎం రేవంత్ సవాలు విసిరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ, నరేంద్ర మోదీ సీఎంగా ఉన్న గుజరాత్, దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో ఈ తరహాలో నియమాకాలు జరిగాయాయో చూపించండని పట్టుబట్టారు. దీనిపై చర్చించేందుకు తాను సిద్ధమని రేవంత్ అన్నారు.

Read Also: TFPC: సీఎం గారూ కృతజ్ఞతలు.. టాలీవుడ్‌లో సంతోషాన్ని నింపిన సీఎం.. మ్యాటర్ ఏంటంటే? 

‘ఎందుకు కడుపుమంట’

తనకు ప్రభుత్వంపై పట్టురాలేదని కొందరు విమర్శలు చేస్తున్నారని అధికారంలో వచ్చిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలు, చేసిన నియమాకాలు చూసి పట్టు వచ్చిందో లేదో మీరే చెప్పాలని రేవంత్ సూటిగా ప్రశ్నించారు. తమ ప్రభుత్వానికి మార్కులు ఇవ్వాలని కోరారు. మరోవైపు హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తే విపక్షానికి ఎందుకు కడుపు మంట అని రేవంత్ అన్నారు. ప్రపంచ దేశాలను హైదరాబాద్ కు రప్పిస్తుంటే ఎందుకంత పగ అని నిలదీశారు. ఫార్ములా రేసింగ్ పేరుతో మీరు పైసలు కొల్లగొట్టారన్న రేవంత్.. మీకు మాకు పొంతనే లేదని స్పష్టం చేశారు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!