TFPC: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీఎం సార్ సంతోషాన్ని నింపారు. ఏం సంతోషం? ఎవరా సీఎం సార్ అని అనుకుంటున్నారు కదా! ఇంకెవరు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి. ఆయన నింపిన సంతోషం మరేదో కాదు. కొన్నేళ్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కోల్పోయిన వైభవాన్ని మళ్లీ తిరిగి అందిస్తున్నారు. అవును, కళాకారులను అవార్డులతో గౌరవించుకునే వైభవాన్ని టాలీవుడ్‌కు తిరిగి కల్పిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌కి వెళితే..
Also Read- Vijay Deverakonda: చట్టప్రకారం నిర్వహిస్తున్న గేమ్స్‌నే ప్రచారం చేశా.. ఆ వార్తలు నిజం కాదు
సంవత్సరం మొత్తం వచ్చిన సినిమాలు, నాటకాలు ఇతరత్రా వాటిలో కొన్ని మెరుగైన వాటిని, మెరుగైన నటనను గుర్తించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైమ్‌లో కళాకారులకు నంది అవార్డులు ఇచ్చేవారు. తెలుగు స్టేట్స్ విడిపోయిన తర్వాత ఈ అవార్డులను ఇచ్చేందుకు ప్రభుత్వాలు ఆసక్తి చూపలేదు. మధ్యలో రెండు మూడు సార్లు ప్రస్తావన వచ్చింది కానీ, అంతగా ముందుకు కదలలేదు. నంది ప్లేస్‌లో సింహా అవార్డ్స్ అంటూ తెలంగాణలోని ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం కాస్త హడావుడి చేసింది. అది కూడా ముందుకు పోలేదు. ఈ విషయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఇతర కళాకారులందరూ నిరుత్సాహంగానే ఉన్నారు.
ఇప్పుడలాంటి వారిలో ఉత్సాహం నింపేలా సీఎం రేవంత్ రెడ్డి డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు. తెలంగాణ సంస్కృతిని నిలిపేలా నంది ప్లేస్‌లో గద్దర్ అనే మహావ్యక్తి పేరిట అవార్డులను ఇవ్వాలని నిర్ణయించారు. గత ప్రభుత్వం మాదిరిగా ప్రకటనకే పరిమితం కాకుండా, దీనికోసం ఓ కమిటీని వేసి వడివడిగా ముందుకు కదిలించారు. అంతేనా, తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖులు, గొప్ప వ్యక్తులైన వారి పేరిట, ప్రభుత్వం తరపున అధికారికంగా అవార్డులను ఇవ్వబోతున్నారు. నిజంగా ఇది గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఇలా ఇచ్చారు కానీ, ఈసారి తెలంగాణకు చెందిన కొందరు గొప్ప వ్యక్తుల పేరిట కూడా అవార్డులు ఇవ్వబోతుండటం విశేషం. అందుకే సీఎం రేవంత్ రెడ్డికి తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కృతజ్ఞతలు తెలిపింది.
Also Read- Vishnu Priya: విచారణకు హాజరైన విష్ణుప్రియ.. స్టేట్‌మెంట్‌లో షాకింగ్ విషయాలు
ఈ మేరకు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి విడుదల చేసిన ప్రకటనలో.. ‘‘2024 సంవత్సరానికి గాను ఉత్తమ చలన చిత్రాలకు, ఉత్తమ కళాకారులు మరియు సాంకేతిక నిపుణులకు గద్దర్ పేరు మీద త్వరలోనే అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖులు మరియు గొప్ప వ్యక్తులైన (1) NTR జాతీయ చలనచిత్ర అవార్డు, (2) పైడి జైరాజ్ చలనచిత్ర అవార్డు, (3) బి.ఎన్. రెడ్డి చలనచిత్ర అవార్డు, (4) నాగి రెడ్డి మరియు చక్రపాణి చలనచిత్ర అవార్డు, (5) కాంతారావు చలనచిత్ర అవార్డు (6) రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డు పేర్లతో ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్’ (GTFA) ను ప్రదానం చేస్తున్నందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తెలంగాణ FDC చైర్మన్ వి. వెంకటరమణ రెడ్డి (దిల్ రాజు)లకు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చలనచిత్ర అవార్డులను పునరుద్ధరించడం పట్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఇది తెలంగాణలో చలనచిత్ర నిర్మాణాన్ని మరింతగా ప్రోత్సహిస్తుందని తెలియజేస్తున్నాము’’ అని తెలిపారు. 12 సంవత్సరాల తర్వాత గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ పేరిట అవార్డులు ఇవ్వబోతున్న తెలంగాణ ప్రభుత్వానికి హీరో నిఖిల్ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు