Vijay Deverakonda: చట్టప్రకారం నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్‌కు మాత్రమే హీరో విజయ్ దేవరకొండ ప్రచారం చేసినట్లుగా ఆయన టీమ్ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్‌ను ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హీరో విజయ్ దేవరకొండతో పాటు రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, మంచు లక్ష్మీ వంటి సెలబ్రిటీలపై కూడా కేసులు నమోదయినట్లుగా ప్రచారం రావడంతో.. వెంటనే రౌడీ టీమ్ అలెర్ట్ అయింది. బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేశాడనే వార్తల నేపథ్యంలో ఆయన టీమ్ అవన్నీ అసత్య వార్తలుగా కొట్టిపారేసింది. దీనిపై విజయ్ టీమ్ వివరణ ఇస్తూ..
Also Read- Vishnu Priya: విచారణకు హాజరైన విష్ణుప్రియ.. స్టేట్‌మెంట్‌లో షాకింగ్ విషయాలు
స్కిల్ బేస్డ్ గేమ్స్‌కు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారం నిర్వహించారని తెలిపారు. స్కిల్ బేస్డ్ గేమ్స్ కంపెనీలు చట్టప్రకారమే నిర్వహిస్తున్నాయని, ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారని వివరణ ఇచ్చారు. ఇప్పటికీ విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా నియమితుడైనా, ఆ కంపెనీని లీగల్‌గా నిర్వహిస్తున్నారా? లేదా? అనేది ఆయన టీమ్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలని చెబుతారని అన్నారు.
ఆయన ప్రచారం చేసే కంపెనీ లేదా ప్రొడక్ట్‌కు చట్టప్రకారం అనుమతి ఉందని నిర్ధారణ అయితేనే విజయ్ ఆ యాడ్‌కు ప్రచారకర్తగా ఉంటారని తెలిపారు. విజయ్ దేవరకొండ అలాంటి అనుమతి ఉన్న ఏ23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారని, ఆ కంపెనీతో ఆయన చేసుకున్న ఒప్పందం గతేడాదితోనే ముగిసిందని వెల్లడించారు. అయినా, రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు గౌరవనీయ సుప్రీం కోర్టు తెలియజేసిందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.
ప్రస్తుతం ఏ23 అనే సంస్థతో విజయ్‌కు ఎలాంటి సంబంధం లేదని, విజయ్ దేవరకొండ విషయంలో పలు మాధ్యమాలలో ప్రసారమవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, విజయ్ ఇల్లీగల్‌గా పనిచేస్తున్న ఏ సంస్థకూ ప్రచారకర్తగా వ్యవహరించలేదని వివరించారు. దయచేసి అసత్యవార్తలు ప్రచారం చేయవద్దని విజయ్ దేవరకొండ టీమ్ ఓ ప్రకటనను విడుదల చేశారు. మరి ఈ వివరణపై పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.
ఇదిలా ఉంటే, ఇప్పుడున్న కేసు ఫైల్ అయిన చాలా మంది సెలబ్రిటీలు కూడా, ప్రస్తుతం ఆయా యాప్స్ ప్రచారం చేయడం లేదు. ఒకప్పుడు చేసిన వీడియోలను బయటికి తీసి రిపోర్ట్ చేస్తున్నారు. అలాగే విజయ్ దేవరకొండ వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవడంతో ఆయనపై కూడా కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. ఏదిఏమైనా ఇలాంటి యాప్స్‌ని ప్రచారం చేయడం కరెక్ట్ కాదని నెటిజన్లు కొందరు ఈ వివరణపై రియాక్ట్ అవుతున్నారు.
ఇక్కడ మొదటి నుంచి చెప్పుకుంటున్న ఓ విషయం మళ్లీ గుర్తు చేసుకోవాలి. అదేంటంటే.. బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసే వారిపై కాదు, వాటిని నిర్వహిస్తున్న వారిని ముందు పోలీసులు కంట్రోల్ చేయాలని మేధావులు కొందరు చెబుతున్నారు. ఇప్పుడు కొన్ని ఓటీటీలలో వచ్చే ప్రోగ్రామ్స్‌ను కూడా ఈ బెట్టింగ్ యాప్స్ సమర్పిస్తుండటం విశేషం. ఆ దిశగా కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తే.. ఇంకొన్ని షాకింగ్ విషయాలు బయటకొచ్చే అవకాశం అయితే లేకపోలేదు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు