Vishnu Priya: ‘అరవింద సమేత’ సినిమాలో ప్రతి 30 సంవత్సరాలకు బతుకు తాలుకా ఆలోచన మారుతుంది. సినిమా వాళ్లు దానిని ట్రెండ్ అంటారు.. వ్యాపారవేత్తలు దానిని ఫ్యాషన్ అంటారు. రాజకీయ నాయకులు తరం అంటారు. మాములు జనం జనరేషన్ అంటారు.. అనే డైలాగ్ ఉంటుంది. అలాగే, సినిమా ఇండస్ట్రీ కూడా.. మరీ అన్ని సంవత్సరాలకు కాదులే కానీ.. సీజన్ సీజన్‌కు ఏదో ఒక విషయంలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. డ్రగ్స్ అని ఒకసారి, నెపోటిజం అని మరోసారి, లైంగిక వేధింపులు అంటూ ఇంకోసారి ఇలా ఏదో ఒక విషయం సినిమా ఇండస్ట్రీని వార్తలలో ఉంచేలా చేస్తుంది. అది టాలీవుడ్, కోలీవుడ్ అని లెక్కలేం లేవ్.. అన్ని ఇండస్ట్రీలలో ఇలాంటివి కామన్‌గా మారిపోయాయి. ఇప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ బెట్టింగ్ యాప్స్ విషయంలో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది.
Also Read- Rana Daggubati: దగ్గుబాటి రానా, ప్రకాశ్ రాజ్‌లపై కేసు నమోదు.. ఏంటి ఇంత సీరియస్‌గా తీసుకున్నారా?
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల నుంచి.. సినిమా ఇండస్ట్రీ వైపు చూపు పడేలా.. బెట్టింగ్ యాప్స్ విషయంలో కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. సామాన్య యూట్యూబర్లతో మొదలై.. యాంకర్స్, స్టార్స్ ఇలా మారుతూ వస్తుంది. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిలో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మీ, నిధి అగర్వాల్.. ఇలా వరుసగా సెలబ్రిటీల పేర్లు బయటికి వస్తున్నాయి. వారిపై కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇలాంటి జాబితాలో ఇప్పటికే కేసు నమోదైన యాంకర్ విష్ణు ప్రియ.. పోలీసుల విచారణను సైతం ఎదుర్కొంది. న్యాయవాది లక్ష్మణ్‌తో కలిసి ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు హాజరైంది. ఆమె విచారణలో ఆసక్తికర విషయాలను వెల్లడించిందని, ఆమె చెప్పిన లెక్కలు, బెట్టింగ్ యాప్స్ వివరాలు తెలిసి పోలీసులే ఆశ్చర్యపోయినట్లుగా తెలుస్తోంది.
విష్ణు ప్రియ స్టేట్మెంట్ లో కీలక విషయాలు
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో భాగంగా భారీగా డబ్బులు తీసుకున్నట్లు ఒప్పుకున్న విష్ణు ప్రియ
మొత్తం 15 బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వీడియోలు చేసిన విష్ణు ప్రియ
ఇన్ స్టా ద్వారా బెట్టింగ్ ప్రమోషన్స్
ఇప్పటికే విష్ణు ప్రియ బ్యాంక్ స్టేట్మెంట్… https://t.co/kETKkdVIk6 pic.twitter.com/BkOQvNI4D7
— BIG TV Breaking News (@bigtvtelugu) March 20, 2025
ఈ విచారణలో.. బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసి భారీగా డబ్బులు సంపాదించినట్లుగా విష్ణు ప్రియ పేర్కొంది. మొత్తం ఆమె 15 బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసినట్లుగా చెప్పడంతో పోలీసులే షాక్ అయ్యారట. ఇన్‌స్టాగ్రమ్ ద్వారా ఈ యాప్స్‌ని ప్రమోట్ చేసినట్లుగా తెలిపిన విష్ణు ప్రియ, కొన్ని యాప్స్ పేర్లు కూడా పోలీసుల విచారణలో బయటపెట్టినట్టుగా సమాచారం. ఈ యాప్స్ కోసం ప్రత్యేకంగా కొన్ని ప్రమోషనల్ వీడియోలు చేసినట్లుగా ఆమె విచారణలో అంగీకరించడంతో.. ఆమె మొబైల్‌ను సీజ్ చేయడమే కాకుండా.. బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి అయితే.. ఆమె స్టేట్‌మెంట్‌లో కొన్ని కీలక విషయాలు రివీల్ చేసిందనేలా వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. మరి ఒక్క విష్ణు ప్రియ దగ్గరే ఇంత సమాచారం ఉంటే.. మిగతా వారిని కూడా విచారిస్తే.. ఇంకా బోలెడంత సమాచారం బయటికి వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. చూద్దాం.. ఈ కేసును పోలీసులు ఎలా డీల్ చేస్తారో? విచారణతో వదిలేస్తారో.. లేదంటే కోర్టు, శిక్షల వరకు తీసుకెళతారో చూడాల్సి ఉంది.
ఫిల్మ్ ఛాంబర్ స్పందనిదే..
ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన బెట్టింగ్ యాప్స్ కేసుపై ఫిల్మ్ చాంబర్ తరపున సెక్రటరీ దామోదర ప్రసాద్ స్పందించారు. ‘సెలబ్రిటీలు తమ హోదాను కాపాడుకోవాలి. ప్రజలకు నష్టం కలిగించే పనులు చేపట్టకూడదు. దీనిపై ఫిల్మ్ ఛాంబర్, ‘మా’ తరపున లేఖ రాయాలని నిర్ణయించాం. యూట్యూబ్‌లో స్టార్స్ అయినంత మాత్రాన, రియల్ లైఫ్‌లో స్టార్స్ కాదనే విషయం గుర్తుంచుకోవాలి’ అని దామోదర ప్రసాద్ తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు