Case filed on Celebrities on Betting Apps Promotion
ఎంటర్‌టైన్మెంట్

Rana Daggubati: దగ్గుబాటి రానా, ప్రకాశ్ రాజ్‌లపై కేసు నమోదు.. ఏంటి ఇంత సీరియస్‌గా తీసుకున్నారా?

Rana Daggubati: బెట్టింగ్ యాప్స్‌‌ను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యాంకర్లు, యూట్యూబర్లపై వరసబెట్టి కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇలాంటి వారైన ఓ 11 మందిపై కేసులు నమోదైనట్లుగా అధికారికంగా న్యూస్ రావడంతో పాటు, వారందరికీ ఆల్రెడీ పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు.

కచ్చితంగా అందరూ విచారణకు హాజరు కావాల్సిందే అనేలా పోలీసులు తెలుపుతున్న నేపథ్యంలో కొందరు నెటిజన్లు.. కేవలం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల పైనే కేసు నమోదు చేస్తారా? ఇలాంటి సెలబ్రిటీలను వదిలేస్తారా? ఇదేం న్యాయం? చట్టం అందరికీ ఒకేలా పనిచేయదా? అంటూ, బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్న స్టార్స్ వీడియోలను పోస్ట్ చేస్తూ.. పోలీసులను ప్రశ్నిస్తున్నారు.

Also Read- Pawan Kalyan: అన్నయ్యకు జీవిత సాఫల్య పురస్కారం.. ఆనందంలో తమ్ముడు!

అలా ప్రశ్నించే వారందరికీ షాక్ ఇస్తూ.. వాళ్లు సెలబ్రిటీలు, స్టార్స్ అని చెబుతున్న వారందరిపై కేసులు నమోదు చేసి షాక్ ఇచ్చారు పోలీసులు. అవును.. హీరో రానా దగ్గుబాటి, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్‌లపైనే కాకుండా, విజయ్ దేవరకొండపై కూడా మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

వీరే కాదండోయ్.. మంచు లక్ష్మీ, నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వంశీ సౌందర్యరాజన్, వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృతా చౌదరి, నయని పావని, నేహా పతాన్, పాండు, పద్మావతి.. ఇలా దాదాపు 25 మందిపై.. బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నందుకుగానూ కేసు ఫైల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సుప్రీత, శ్యామల, టేస్టీ తేజ వంటి 11 మందిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.

అయితే ఇదంతా చూసిన వారంతా.. ఏంటి ఇంత సీరియస్‌గా తీసుకున్నారేంటి? నిజంగా బెట్టింగ్ మాఫియాను రూపుమాపడానికేనా? లేక వెనుక ఏదైనా కారణం ఉందా? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తుండటం విశేషం. ఎందుకంటే, బయట వేరే ఏదైనా కొంపలు ముంచే విషయం ఉన్నప్పుడు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు  దారి మళ్లీంచడానికి ఇలాంటివే చేస్తుంటారనే నానుడి ఉంది.

Also Read- Bharadwaja Thammareddy: రెమ్యూనరేషన్ ఎక్కువ అడిగి తప్పించుకోవాలని చూశాడు.. కానీ?

అప్పట్లో డ్రగ్స్ విషయంలో కూడా సెలబ్రిటీలు కొందరినీ ఇలాగే పిలిచి హడావుడి చేశారు. కానీ ఆ తర్వాత ఆ కేసు ఏమైందో అందరికీ తెలిసిందే. అలాగే ఇప్పుడు కూడా ఏదైనా అజెండా ఉందా? అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నిజంగానే బెట్టింగ్ యాప్స్ డేంజర్‌గా మారాయి. అమాయకులు ఎందరో రోజూ ఈ యాప్స్ కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సజ్జనార్ వంటి ప్రముఖులు ఈ యాప్స్ ఎంత ప్రమాదకరమనేది చెబుతూనే వస్తున్నారు. ఆయన ముందుకు వచ్చి మరీ పోరాటం చేస్తున్నారు కాబట్టి.. ఈ కేసు నమోదుల వెనుక ఎటువంటి అజెండా లేదనే అనుకోవచ్చు.

అయితే కొందరు మేధావులు మాత్రం.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారిని కాదు, అసలు ఆ బెట్టింగ్ యాప్స్ నడిపే వారిని అరెస్ట్ చేస్తేనే, అవి ఆగుతాయని.. ఇలాంటి వారిని అరెస్ట్ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదని చెబుతున్నారు. నిజమే.. వాళ్లు చెబుతున్నదానిలోనూ పాయింట్ ఉంది. మరి ఆ దిశగా అడుగులు పడతాయేమో చూద్దాం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?