Pawan Kalyan: అన్నయ్యకు జీవిత సాఫల్య పురస్కారం.. హ్యాపీ!
Pawan Kalyan Happy with His Brother Got Rare Award (Image Source: Pawan Kalyan X Post)
ఎంటర్‌టైన్‌మెంట్

Pawan Kalyan: అన్నయ్యకు జీవిత సాఫల్య పురస్కారం.. ఆనందంలో తమ్ముడు!

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) యునైటెడ్ కింగ్‌డమ్ పార్లమెంట్ జీవిత సాఫల్య పురస్కారం పొందినందుకు తనకెంతో ఆనందంగా ఉందని తెలిపారు పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సోషల్ మీడియా వేదికగా ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు. గత రాత్రి మెగాస్టార్ చిరంజీవి లండన్‌లోని యుకె పార్లమెంట్‌లో బ్రిటిష్ ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మకమైన జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ ప్రముఖుడు మెగాస్టార్ చిరంజీవే కావటం తెలుగువారందరికీ గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అందుకే తెలుగువారంతా గర్వించే రోజుగా చెప్పుకుంటూ.. మెగాస్టార్‌కు అంతా అభినందనలు తెలుపుతున్నారు.

Also Read- Chaitu – Sobhita: మ్యాగజైన్ కవర్ పేజీపై కొత్త జంట.. చైతూ ఎలా పడేశాడో చెప్పేసిన శోభిత!

తన అన్నయ్యకు ఇలాంటి అరుదైన పురస్కారం లభించినందుకు తమ్ముడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) ఎంతగానో సంతోషిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన చేసిన పోస్ట్‌లో.. ‘‘సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కుమారుడిగా జీవితం మొదలుపెట్టి.. స్వశక్తితో, కళామతల్లి దీవెనలతో, చిత్ర రంగంలో మెగాస్టార్‌గా ఎదిగి, దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తూ, తన నటనతో ఉత్తమ నటుడిగా 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకుని, నటనకు పర్యాయపదంగా నిలిచిన వ్యక్తి అన్నయ్య. ఆయన తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడూ గర్విస్తూనే ఉంటాను.

నేను ఆయనని ఒక అన్నయ్యగా కంటే ఒక తండ్రి సమానుడిగా భావిస్తాను. నేను జీవితంలో ఏం చేయాలో తెలియక, అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో నాకు మార్గం చూపించిన వ్యక్తి ఆయన. నా జీవితానికి హీరో అన్నయ్య చిరంజీవి. తన సేవా భావంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం ద్వారా ఆపదలో ఉన్నవారికి రక్తదానం, నేత్రదానం అందిస్తూ.. నన్నే కాకుండా కోట్లాదిమంది అభిమానులను సమాజ సేవకులుగా మార్చిన స్ఫూర్తి ప్రదాత మా అన్నయ్య. తాను ఎదగడమే కాకుండా తన కుటుంబంతో పాటుగా, ఎంతోమంది ఎదుగుదలకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సహాయ సహకారాలు అందిస్తూ, టాలెంట్ ఉన్న ఎవరైనా సరే ఏ రంగంలో అయినా సరే రాణించవచ్చు అనేందుకు ఉదాహరణగా నిలిచారు.

Also Read- Bharadwaja Thammareddy: రెమ్యూనరేషన్ ఎక్కువ అడిగి తప్పించుకోవాలని చూశాడు.. కానీ?

ఆయన సమాజానికి అందించిన సేవలకుగానూ ఇటీవల భారత ప్రభుత్వం రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ చేతుల మీదుగా అందుకున్నారు. ఇప్పుడు యునైటెడ్ కింగ్ డమ్ పార్లమెంట్ పద్మవిభూషణ్ (Padma Vibhushan) డా. మెగాస్టార్ చిరంజీవికి, ఈనెల 19న జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించిన వార్త నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకుని మా అందరికీ ఇలాగే మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ పురస్కార కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న స్టాక్ పోర్ట్ ఎంపీ నవేందు మిశ్రాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..’’ అని పవన్ కళ్యాణ్ తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..