Bharadwaja Thammareddy: సినిమాలో నటించమంటూ నా దగ్గరకు వచ్చారు. వీళ్లని ఎలాగైనా వదిలించుకోవాలని రెమ్యూనరేషన్ ఎక్కువ చెప్పాను.. అయినా కూడా వాళ్లు వెనుకాడలేదని చెప్పారు దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్. ఆయన ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’ (O Andala Rakshasi). దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న షెరాజ్ మెహదీ (Shairaz Mehdi) హీరో నటిస్తూ, ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా స్కై ఈజ్ ద లిమిట్ బ్యానర్‌పై సురీందర్ కౌర్ నిర్మించగా.. తేజిందర్ కౌర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మార్చి 21న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను తాజాగా మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇందులో కీలక పాత్రలో నటించిన తమ్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Also Read- Chaitu – Sobhita: మ్యాగజైన్ కవర్ పేజీపై కొత్త జంట.. చైతూ ఎలా పడేశాడో చెప్పేసిన శోభిత!
ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ.. భాష్య శ్రీ ఈ సినిమా కథతో నా దగ్గరకు వచ్చారు. ఈ సినిమాలో ఎలాగైనా సరే మీరు చేయాల్సిందే అని అన్నారు. ఇప్పుడు మళ్లీ యాక్టింగ్ ఎక్కడ చేస్తాం అని.. వాళ్లని ఎలాగైనా వదిలించుకోవాలని భారీగా రెమ్యునరేషన్ అడిగాను. అంత వాళ్లు ఎలాగో ఇవ్వరులే.. నన్ను వదిలేస్తారులే అని అనుకున్నా. కానీ నేను అడిగినంత అమౌంట్ ఇచ్చారు. అలాగే అడగకముందే మొత్తం అమౌంట్ ఇచ్చేశారు. నా ఇన్నేళ్ల కెరీర్లో ఇంత మొత్తం చూసింది ఇదే మొదటిసారి అని కచ్చితంగా చెప్పగలను. ఉమెన్ సెంట్రిక్‌గా సాగే ఈ కథ చాలా బాగుంది. నాకు స్క్రిప్ట్ కూడా నచ్చే ఈ సినిమాలో చేశాను. ఇలాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాలి. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించాలి. భాష్యశ్రీ కథ, షెరాజ్ టేకింగ్ చాలా బావుంది. మార్చి 21న వస్తున్న ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు.
‘‘మేము చేసిన ఈ చిన్న సినిమాలో మంచి పాత్రను పోషించి, మాకు అండగా నిలిచిన తమ్మారెడ్డి భరద్వాజ్‌కు థాంక్స్. కథ చెప్పిన వెంటనే ఆయన ఎంతో ఎగ్జైట్ అయ్యారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా దర్శకనిర్మాతకు థాంక్స్. ఇది ఇప్పుడు అందరికీ చిన్న సినిమాగానే అనిపిస్తుంది. కానీ దీని సత్తా విడుదల తర్వాత తెలుస్తుంది’’ అని అన్నారు కథా రచయిత భాష్య శ్రీ.
Also Read- Chiru-Anil: చిరంజీవి – అనిల్ రావిపూడి ప్రాజెక్ట్‌లో హీరోయిన్ ఫిక్సయిందా?
హీరో కమ్ దర్శకుడు షెరాజ్ మెహదీ మాట్లాడుతూ.. ఇలాంటి చిన్న చిత్రాల్లో నటించి మాలాంటి వాళ్లకు సపోర్ట్ ఇచ్చిన దర్శకనిర్మాత తమ్మారెడ్డికి థాంక్స్. సినిమా ఇండస్ట్రీలో క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. ఇప్పటివరకు ఆ క్రమశిక్షణతోనే నేను సినిమాలు చేస్తూ వచ్చాను. ఇకపై కూడా అలాగే చేస్తాను. ఈ సినిమా థియేటర్లలోకి రానంతవరకే చిన్న సినిమా. ఒక్కసారి థియేటర్లలోకి వచ్చిన తర్వాత సినిమా రేంజ్ ఏంటో ప్రేక్షకులకు తెలుస్తుంది. టీమ్ అంతా ఒక ఫ్యామిలీలా ఈ సినిమాకు పని చేశాం. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్‌గా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. మార్చి 21న వస్తున్న ఈ సినిమాను చూసి అందరూ సపోర్ట్ చేయండని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర హీరోయిన్లు మాట్లాడారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు