Prakash Raj: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ నిమిత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీలోని పలువురిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, నిధి అగర్వాల్, మంచు లక్ష్మీ వంటి వారితో పాటు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌పై కూడా కేసు నమోదైంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ ఈ యాప్స్ ప్రమోషన్‌పై తన టీమ్ తరపున అధికారిక వివరణ ఇచ్చారు. మరోవైపు ఈ కేసులో నోటీసులు అందుకున్న వారు పోలీసుల విచారణకు హాజరవుతున్నారు. విష్ణుప్రియ, టేస్టీ తేజ, రీతూ చౌదరి వంటి వారు పోలీసుల విచారణలో పాల్గొన్నారు. మిగతా వారు కూడా విచారణకు రావాల్సిందేనని పోలీసులు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో.. ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో 9 సంవత్సరాల క్రితం తను ఇలాంటి ఒక యాప్‌ని ప్రమోట్ చేసింది నిజమేనని ఒప్పుకున్నారు. కానీ దానివల్ల ఏం జరుగుతుందో తెలుసుకుని, ఆ వెంటనే దానికి స్వస్తి చెప్పానని తెలిపారు. పోలీసులు కనుక పిలిచి విచారిస్తే.. వివరణ ఇస్తానని తెలిపారు. అసలు ప్రకాష్ రాజ్ ఏం చెప్పారంటే..
‘‘ అందరికీ నమస్కారం, ఒక ఇంట్రస్టింగ్ సినిమా షూట్ నిమిత్తం ఒక విలేజ్‌లో ఉన్నాను. అదే ఈ గెటప్. ఇక్కడున్నప్పుడు ఇప్పుడే నాకు ఈ ఆన్‌లైన్‌లో, పలు మీడియాల్లో.. ఒక ఆన్‌లైన్ గేమింగ్ యాప్, దాని గురించి నేను చేసిన యాడ్ గురించి డిస్కషన్ జరుగుతుంది. అందరినీ ప్రశ్నించే నేను సమాధానం చెప్పాలి కదా. ఎందుకంటే, చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు.. మీరెలా చేస్తారు అని. అది నేను 2016లో అంటే 9 సంవత్సరాల క్రితం ఇలాంటి యాడ్ ఒకటి నా దగ్గరకు వచ్చింది. నేను చేశాను.. ఇది నిజం. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పని నాకు అర్థమైంది.
My response to all 🙏🏿🙏🏿🙏🏿 #SayNoToBettingAps #justasking pic.twitter.com/fNwspZodOP
— Prakash Raj (@prakashraaj) March 20, 2025
వాళ్లు మళ్లీ 2017లో కాంట్రాక్ట్‌ని పొడిగిస్తానంటే.. లేదండి తప్పు.. తెలియక చేసేశాను కాబట్టి.. అగ్రిమెంట్ ప్రకారం నేను చేయాలి. కానీ 2017 నుంచి మీరు అడగకూడదు.. నేను చేయను అని చెప్పేశాను. దాని తర్వాత అలాంటి ఏ గేమింగ్ యాప్స్ నేను చేయలేదు. 2021లో ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేసి.. వాళ్లు ఏదో సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో యూజ్ చేస్తే నేను వాళ్లకి నోటీసు, ఈ-మెయిల్, వాట్సప్ పంపించి.. లేదండీ, అందులో నేను లేను. ఇది మీరు చేయకూడదు. కాంట్రాక్ట్ అయిపోయింది, ఇది తప్పు అని కూడా చెప్పాను. వాళ్లు కూడా ఆపేశారు.
Also Read- TFPC: సీఎం గారూ కృతజ్ఞతలు.. టాలీవుడ్‌లో సంతోషాన్ని నింపిన సీఎం.. మ్యాటర్ ఏంటంటే?
ఇప్పుడా వీడియో మళ్లీ లీకైంది. దానివల్లే ఈ సమాధానం. అయితే పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి ఇంకా నాకు ఎటువంటి నోటీసు రాలేదు. ఒకవేళ వస్తే.. వారికి నేను సమాధానం చెబుతాను. కానీ, మీకు నేను సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. సో.. 9వ సంవత్సరాల క్రితం వన్ ఇయర్ కాంట్రాక్ట్ నేను చేసింది నిజం. అది తెలిసిన తర్వాత ఆపింది నిజం. ఆ తర్వాత నేను చేయలేదనేది కూడా నిజం. ఈ మాట మీ అందరికీ చెబుతున్నాను. ఇంకో విషయం ఏమిటంటే.. దయచేసి యంగ్‌స్టర్స్, ఇలాంటి గేమింగ్ యాప్స్ అనేది ఒక వ్యసనం లాంటివి. మీ జీవితాన్ని కోల్పోకండి.. థ్యాంక్యూ’’ అని ప్రకాష్ రాజ్ ఈ వీడియోలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది. నెటిజన్లు కొందరు ప్రకాష్ రాజ్ ‘ఎక్స్’ పోస్ట్‌కు మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు