Krystyna Pyszkoza - Hyderabad: మనసు దోచిన ప్రపంచ సుందరి
Krystyna Pyszkoza - Hyderabad
హైదరాబాద్

Krystyna Pyszkoza – Hyderabad: మనసు దోచిన ప్రపంచ సుందరి.. మన గురించి తెగ వాగేసింది

Krystyna Pyszkoza – Hyderabad: హైదరాబాద్ వేదికగా మే 7 నుంచి 72వ మిస్ వరల్డ్ పోటీలు జగరనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బేగంపేట్ టూరిజం ప్లాజాలో ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఏర్పాట్లపై ఈ సమావేశంలో మాట్లాడారు. ఇందులో మంత్రి జూపల్లి, TGTDC చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్, మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా మోర్లీ, 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా పాల్గొన్నారు.

‘నమస్తే ఇండియా ‘
ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో విశ్వసుందరి.. క్రిస్టినా పిజ్కోవా (Krystyna Pyszkoza) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. నమస్తే ఇండియా అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. భారత సంస్కృతి, కళలు చాలా గొప్పగా ఉన్నాయని ఆమె చెప్పారు. ఈ దేశంలో స్ఫూర్తి లభిస్తుందని, విలువలు బోధిస్తారని పేర్కొన్నారు. ఎన్నో భాషలు, మతాలు ఉన్నా అందరూ ఒక్కటిగా ఉంటూ స్పూర్తి నింపుతున్నట్లు చెప్పారు. మిస్ వరల్డ్ కూడా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని ఆమె చెప్పుకొచ్చారు. తెలంగాణ పర్యటన సందర్భంగా ఇక్కడి చాలా దేవాలయాలను సందర్శించినట్లు క్రిస్టినా పిజ్కోవా అన్నారు. ఈ జర్నీ తనకు ఎప్పటికీ గుర్తుండి పోతుందని సంతోషం వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్ విజన్ తోనే..
ఇదే కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. పెట్టుబడులను ఆకర్షించేందుకు 72వ మిస్ వరల్డ్ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) విజన్‌తో మిస్ వరల్డ్ 2025 (Miss World 2025)పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు అవకాశం లభించిందని అన్నారు. దీని వల్ల రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. దాదాపు 140 దేశాలకు చెందిన వారు ఈ ఈవెంట్ కోసం వస్తారన్న మంత్రి.. తెలంగాణ బ్యూటీని ప్రపంచానికి చూపిస్తామని అన్నారు. అయితే అందాల పోటీలను మరో కోణంలో చూడవద్దని మంత్రి జూపల్లి సూచించారు. ఎంతో అమ్మాయిలు-మహిళలకు మనోధైర్యాన్ని, సంకల్పాన్ని ఈ ఈవెంట్ ఇస్తుందని స్పష్టం చేశారు.

Also Read: Rajanna Sircilla Crime: బురిడి బాబా రాసలీలలు.. వీడు మామూలోడు కాదు!

అవి చాలా స్పెషల్
మరోవైపు మిస్ వరల్డ్ అందాల పోటీలపై టూరిజం శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ స్మిత సబర్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మిస్ వరల్డ్ క్రిస్టినా, మిస్ వరల్డ్ సీఈఓ రాకతో తెలంగాణ ఆనందంగా ఉందని చెప్పారు. ఈ రాష్ట్రం అనేక సంస్కృతులు, సంప్రదాయాలు, ఆలయాలకు ప్రతీక అన్న ఆమె.. ఎంతోమంది మేధావులు, కవులతో ఉన్న ఇల్లు తెలంగాణ అని కొనియాడారు. ఇక్కడ తెలంగాణ వంటకాలతో పాటు హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్ చాలా స్పెషల్ అని గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి

Vishnu Priya: విచారణకు హాజరైన విష్ణుప్రియ.. స్టేట్‌మెంట్‌లో షాకింగ్ విషయాలు

Jack Kiss Song: భాగ్యనగరంలో ముద్దుకి లేదే సింగిల్ స్పాట్.. పాపం సిద్ధు, నీ కష్టం పగోడికి కూడా రాకూడదు!

Just In

01

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..