Hyderabad Student In USA(Image credit:AI)
హైదరాబాద్

Hyderabad Student In USA: అమెరికాను మెప్పించిన ఎల్బీ నగర్ కుర్రాడు.. జీతం కోట్లల్లోనే..

ఎల్బీనగర్, స్వేచ్ఛ: Hyderabad Student In USA:  అమెరికాలో హైదరాబాద్, ఎల్బీనగర్ కుర్రాడు మెరిశాడు. ఏకంగా రూ.3 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించి భళా అనిపించాడు. ఎల్బీనగర్ చిత్రా లే అవుట్ కు చెందిన గుడె సాయి దివేశ్ చౌదరి అమెరికాలోని ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్వీడియాలో వార్షిక వేతనంగా రూ.3 కోట్ల వేతనంతో ఉద్యోగం సాధించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. దివేశ్ తండ్రి కృష్ణ మోహన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా, తల్లి హైదరాబాద్ శివారులోని రమాదేవి పబ్లిక్ స్కూల్లో టీచర్ గా పదేండ్ల పాటు పనిచేశారు.

Also read: Hyderabad Cyber Crime: వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నాడు.. పని లేదన్నాడు.. అంతా దోచేశాడు

సాయి దివేశ్ విద్యాభ్యాసం ఐదు నుంచి పదో తరగతి వరకు రమాదేవి పబ్లిక్ స్కూల్ లోనే కొనసాగింది. ఇంటర్ లో మెరుగైన స్కోరు సాధించి ఎన్ఐటీ కురుక్షేత్రలో కంప్యూటర్ సైన్స్ లో ఇంజినీరింగ్ అభ్యసించారు. అక్కడే న్యూటానిక్స్ కంపెనీలో రూ.40లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. అనంతరం లాస్ఏంజెల్స్ లోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో క్లౌడ్, ఏఐ టెక్నాలజీలో ఎంఎస్ పూర్తి చేసిన దివేశ్ చౌదరి.. ఎన్వీడియా కంపెనీలో డెవలప్ మెంట్ ఇంజినీర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు.

Also read: Bharadwaja Thammareddy: రెమ్యూనరేషన్ ఎక్కువ అడిగి తప్పించుకోవాలని చూశాడు.. కానీ?

చిన్నప్పటి నుంచి చదువుల్లోనే కాకుండా.. క్రీడలు, కాంపిటీటివ్ ఈవెంట్లలో ముందుండేవారు. ప్రస్తుతం ఏఐ ఆధారిత యాప్ అభివృద్ధి చేస్తున్నాడు. డిజిటల్ ప్రపంచానికి అనుగుణంగా తన కలల్ని నెరవేర్చుకొనే దిశగా దివేశ్ చౌదరి ప్రయాణం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకం.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!